న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓడినవారు సాకులు చెప్తారు: పింక్ బాల్ టెస్ట్‌ ఓటమిపై బంగ్లాదేశ్ కెప్టెన్

 Losers give excuses: Mominul Haque accepts Bangladesh exposed by India after Test series loss

హైదరాబాద్: వచ్చే ఏడాది టెస్టు సీజన్‌కు మానసికంగా దృఢంగా సన్నద్ధమవ్వాల్సిన అవసరముందని బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్‌ మొమినుల్‌ హక్‌ తెలిపాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారంతో ముగిసిన చారిత్రాత్మక డే నైట్ టెస్టులో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కెప్టెన్‌ మీడియాతో మాట్లాడుతూ "ఒక జట్టుగా మేము బ్యాటింగ్ లేదా బౌలింగ్ రెండింటిలోనూ సరిగ్గా ఆడలేకపోయాము. మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మేము మెరుగుపడితే వచ్చే ఏడాది మంచి ప్రదర్శన చేస్తాం. 2020లో మాకు సుమారు 10 టెస్టులు ఉన్నాయి" అని అన్నాడు.

<strong>IND Vs BAN, Day-Night Test: పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా సాధించిన రికార్డులివే!</strong>IND Vs BAN, Day-Night Test: పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా సాధించిన రికార్డులివే!

బంగ్లా తరచూ టెస్టులు ఆడదని మీకు తెలుసు

బంగ్లా తరచూ టెస్టులు ఆడదని మీకు తెలుసు

"మా జట్టు తరచూ టెస్టులు ఆడదని మీకు తెలుసు. వచ్చే ఏడాది మొత్తం పది టెస్టులు ఆడాల్సి ఉంది. అందుకోసం మానసికంగా సన్నద్ధమవ్వాలి. రోజు రోజుకు మెరుగవుతాం. అయితే, ఇందుకు కాస్త సమయం పడుతుంది. ఈ సిరిస్‌లో యువ బ్యాట్స్‌మెన్‌ తెలుసుకోవాల్సింది ఏంటంటే తప్పులతోనే భవిష్యత్‌లో మంచి ఫలితాలు వస్తాయి" అని తెలిపాడు.

ఓటమికి పింక్‌ బాల్‌ను కారణం కాదు

ఓటమికి పింక్‌ బాల్‌ను కారణం కాదు

అయితే, ఈడెన్‌లో తమ ఓటమికి పింక్‌ బాల్‌ను కారణంగా చెప్పదలచుకోలేదని మొమినుల్ హక్ తెలిపాడు. "మా ఓటమికి సాకు చెప్పడంలో అర్థం లేదు. ఓడిపోయినవారు సాకులు చెప్తారు. ఒక జట్టుగా మేము మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయాం. మేము పేలవంగా బ్యాటింగ్ చేసాము. ఈ సిరీస్ నుండి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. పోరాటం ఒకదాన్ని పరిపూర్ణంగా చేస్తుంది. ఇది నిరాశ చెందడం కంటే నేర్చుకోవడం మంచింది" అని అన్నాడు.

ఆ నిర్ణయం తప్పుడిదేనా?

ఆ నిర్ణయం తప్పుడిదేనా?

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు డే నైట్‌ టెస్టుకు ఒప్పుకోవడం తప్పుడు నిర్ణయమా? అని అడిగిన ప్రశ్నకు మొమినుల్ హాక్ "ఆ నిర్ణయం తప్పేమీ కాదు. మేం ఓడిపోయినా, ఎప్పుడో ఒకసారి దీనిని మొదలు పెట్టాల్సిందే. భారత్‌ కూడా పింక్‌ టెస్టును తొలిసారే ఆడింది. అయితే, కాస్తా సమయం దొరికుంటే, మాకు ప్రాక్టీస్‌ చేసుకునే వీలుండేది, కానీ అలా జరగలేదు" అని పేర్కొన్నాడు.

షకీబ్ అల్‌ హసన్‌‌పై నిషేధం విధించడంతో

షకీబ్ అల్‌ హసన్‌‌పై నిషేధం విధించడంతో

ఇటీవలే బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్ అల్‌ హసన్‌‌పై నిషేధం విధించడంతో బంగ్లా క్రికెట్ బోర్డు మొమినుల్‌ హక్‌ను టెస్టు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత ప్రదర్శనపై మొమినుల్ హాక్ మాట్లాడుతూ"నా వ్యక్తిగత ప్రదర్శనపై ఎక్కువగా ఆలోచించను. జట్టు గురించి మాత్రమే ఆలోచిస్తా. అయితే, మేం ఆడిన విధానం మాత్రం బాధపెడుతోంది. బ్యాటింగ్‌లో నేను ఇబ్బంది పడి ఉండొచ్చు... త్వరలోనే పుంజుకుంటా" అని వెల్లడించాడు.

మంచు తగ్గిన తర్వాత పింక్ బాల్‌ను

మంచు తగ్గిన తర్వాత పింక్ బాల్‌ను

"ప్రతి ఒక్కరూ తమీమ్‌ను మిస్సయ్యాం. అయితే, ఇదొక గొప్ప అవకాశం... దానిని అవకాశంగా మలచుకోలేకపోయాం. పింక్ బాల్‌తో బ్యాటింగ్ కొత్త అనుభూతినిచ్చింది. మంచు ప్రభావం తగ్గిన తర్వాత పింక్ బాల్‌ను ఎదుర్కొవడం సులభంగానే ఉంది" అని మొమినుల్ హక్ తెలిపాడు.

Story first published: Monday, November 25, 2019, 13:11 [IST]
Other articles published on Nov 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X