న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాబిన్సన్‌ రాజీనామా.. ఇంగ్లండ్‌ జట్టుకు తొలి మహిళా హెడ్‌ కోచ్‌!!

Lisa Keightley becomes England womens head coach

లండన్‌: ఇటీవలి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అందుకు తగ్గట్టుగానే వారికి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. తాజాగా ఇంగ్లండ్‌ మహిళల జట్టుకు మహిళా క్రికెటర్‌ హెడ్‌ కోచ్‌గా నియమిచబడింది. ఆ్రస్టేలియా మాజీ క్రికెటర్‌ లీసా కెయిట్లీని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) తమ మహిళల జట్టుకు హెడ్‌ కోచ్‌గా నియమించింది. ఇంగ్లండ్‌ మహిళల జట్టుకు తొలిసారి మహిళా క్రికెటర్‌ హెడ్‌ కోచ్‌గా నియమించబడడటం ఇదే తొలిసారి. లీసా 9 టెస్టుల్లో, 48 వన్డేల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించింది.

T10 League: బ్రాండ్ అంబాసిడర్‌గా సన్నీ లియోన్‌.. ఢిల్లీ జట్టుకు ఆమె అందం!!T10 League: బ్రాండ్ అంబాసిడర్‌గా సన్నీ లియోన్‌.. ఢిల్లీ జట్టుకు ఆమె అందం!!

మార్క్‌ రాబిన్సన్‌ ఇప్పటి వరకు ఇంగ్లండ్‌ మహిళల జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. రాబిన్సన్‌ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ 2017లో ప్రపంచకప్ గెలిచింది. తన నాలుగేళ్ల పదివి కాలం ముగిసింది. అయితే, యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఓటమి తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈసీబీ 48 ఏళ్ల లీసా కెయిట్లీని హెడ్‌ కోచ్‌గా నియమించింది. వచ్చే జనవరిలో లీసా తన బాధ్యతలు స్వీకరిస్తుంది.

2009-2015 మధ్య కాలంలో లీసా ఇంగ్లాండ్ క్రికెట్ అకాడమీకి నాయకత్వం వహించింది. మహిళా క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ క్లేర్ కానర్ మరియు ఈబీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హారిసన్లతో కూడిన ప్యానెల్ లీసాను కోచ్‌గా ఎంపిక చేసింది. భారత్, ఆస్ట్రేలియా పాల్గొననున్న టీ20 ట్రై-సిరీస్ ద్వారా లీసా కోచ్‌గా బాధ్యతకు చేపట్టనుంది.

ది హండ్రెడ్‌లో లండన్ స్పిరిట్ జట్టుకు లీసా హెడ్‌ కోచ్‌గా ఉన్నా.. ఇంగ్లాండ్ విధులపై దృష్టి పెట్టడానికి ఆ పదవికి రాజీనామా చేసింది. లీసా కెయిట్లీ ప్రస్తుతం లీసా బిగ్‌ బాష్‌ టి20 లీగ్‌లో పెర్త్‌ స్కార్చర్స్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ మహిళల వన్డే జట్టు వరల్డ్‌ చాంపియన్‌గా ఉండగా.. టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరింది.

లీసా కెయిట్లీ మాట్లాడుతూ... 'నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఇది చాలా పెద్ద అవకాశం. ప్రపంచ స్థాయి ఆటగాళ్ళతో నిండిన జట్టు ఇంగ్లాండ్. కొన్ని సంవత్సరాల క్రితం నేను పనిచేసిన కొంతమంది ఆటగాళ్లతో మళ్లీ కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. నా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నా' అని అన్నారు.

Story first published: Thursday, October 31, 2019, 11:17 [IST]
Other articles published on Oct 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X