న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Left or Right: శ్రీలంక-ఇంగ్లాండ్ మ్యాచ్‌లో ఆశ్చర్యపోయే సంఘటన (వీడియో)

Left or Right, Its All the Same for Sri Lankas Kamindu Mendis

హైదరాబాద్: కొలంబో వేదికగా శ్రీలంక-ఇంగ్లండ్‌ జట్ల మధ్య శనివారం జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయే సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన శ్రీలంక స్పిన్నర్‌ కామిందు మెండిస్‌ రెండు చేతులతో బౌలింగ్‌ చేసి ఆకట్టుకున్నాడు.

లెఫ్టార్మ్‌ స్పిన్‌ వేసిన కామిందు మెండి

లెఫ్టార్మ్‌ స్పిన్‌ వేసిన కామిందు మెండి

కుడిచేతి వాటం ఆటగాడికి లెఫ్టార్మ్‌ స్పిన్‌ వేసిన కామిందు మెండిస్, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌కు ఆఫ్‌ స్పిన్‌ బంతులు విసిరి ఆశ్చర్యపరిచాడు. మెండిస్ లెఫ్టార్మ్‌తో వేసిన తొలి బంతికి జాసన్‌ రాయ్‌ సింగిల్‌ తీశాడు. వెంటనే మెండిస్‌ తన బౌలింగ్‌ను మారుస్తున్నట్లు అంపైర్‌కు చెప్పాడు.

మూడు ఓవర్లు వేసిన 27 పరుగులు

మూడు ఓవర్లు వేసిన 27 పరుగులు

ఈసారి మెండిస్ రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ స్పిన్‌ బంతిని స్టోక్స్‌ ఎదుర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం మూడు ఓవర్లు వేసిన కామిందు మెండిస్ 27 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మెండిస్ మూడో ఓవర్లో ఇద్దరు లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌లు ఉండటంతో మెండిస్‌కు బౌలింగ్‌ మార్చాల్సిన అవసరం లేకపోయింది.

రెండు చేతులతో బౌలింగ్‌ చేయడం ఇదే మొదటిసారి

అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ బౌలర్ ఇలా రెండు చేతులతో బౌలింగ్‌ చేయడం ఇదే మొదటిసారి. దేశవాళీ క్రికెట్‌లో అక్షయ్‌ కర్నేవర్‌ (భారత్‌), జెమా బార్స్‌బై (ఆస్ట్రేలియా) క్రికెటర్లు ఉన్నప్పటికీ... వారు జాతీయ జట్టులో మాత్రం ఆడలేదు. శ్రీలంక అండర్‌-19 జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన 20 ఏళ్ల కామిందు మెండిస్‌ బ్యాటింగ్‌లో మాత్రం ఎడంచేతితో ఆడతాడు.

Story first published: Monday, October 29, 2018, 13:18 [IST]
Other articles published on Oct 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X