న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ మ్యాచ్‌ ఎన్నో రోజులు గుర్తుంచుకోవచ్చు.. రోహిత్‌, షమీపై మాజీల ప్రశంసల జల్లు!!

IND VS NZ 2020 : Rohit Sharma And Shami's Super Over Heroics Invite Praises
Laxman, Sehwag and others shower high praise on Rohit Sharma and Mohammed Shami

హామిల్టన్‌: బుధవారం సెడాన్‌ పార్క్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 'సూపర్‌ ఓవర్‌'లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్లో మహ్మద్ షమీ మ్యాజిక్‌, సూపర్‌ ఓవర్లో రోహిత్‌ శర్మ డబుల్‌ సిక్సర్‌లతో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో న్యూజిలాండ్‌ గడ్డపై భారత్ తొలి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక మరో రెండు మ్యాచులు మిగిలుండగానే టీమిండియా 3-0తో సిరీస్‌ను సాధించి క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది.

ఓ దశలో మ్యాచ్‌ చేజారిందనుకున్నా.. ఓడిపోతామని కోచ్‌కు చెప్పా: కోహ్లీఓ దశలో మ్యాచ్‌ చేజారిందనుకున్నా.. ఓడిపోతామని కోచ్‌కు చెప్పా: కోహ్లీ

సూపర్‌ విజయం:

సూపర్‌ విజయం:

మూడో టీ20లో టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. రోహిత్‌ (40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 65) హాఫ్‌ సెంచరీ చేయగా.. కోహ్లీ (27 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 38), కేఎల్‌ రాహుల్‌ (19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 27) రాణించారు. ఛేదనలో న్యూజిలాండ్‌ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులే చేసింది. విలియమ్సన్‌ (48 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 95) చెలరేగగా.. గప్టిల్‌ (21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 31) వేగంగా ఆడాడు. సూపర్‌ ఓవర్లో న్యూజిలాండ్‌ 17/0 స్కోరు చేయగా.. భారత్‌ 20/0తో విజయం అందుకుంది.

రోహిత్‌, షమీపై ప్రశంసల వర్షం:

రోహిత్‌, షమీపై ప్రశంసల వర్షం:

పవర్‌ ప్లేలో హాఫ్‌ సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇక కివీస్ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఫోర్లు, సిక్సర్లతో తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడి న్యూజిలాండ్‌ను విజయం అంచుల దాకా నడిపించినా.. షమీ మ్యాజిక్‌కు వెనుదిరిగాడు. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్‌, షమీలపై మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఎన్నో రోజులు గుర్తుంచుకోవచ్చు:

ఎన్నో రోజులు గుర్తుంచుకోవచ్చు:

అద్భుత విజయం. చివరి 4 బంతుల్లో షమీ 2 పరుగులే ఇవ్వడం సంచలనం. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర బ్యాట్స్‌మెన్‌లో తానూ ఒకడని రోహిత్‌ నిరూపించాడు. ఈ మ్యాచ్‌ ఎన్నో రోజులు గుర్తుంచుకోవచ్చు అని టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. 'అసాధ్యాలను సుసాధ్యం చేసేందుకు రోహిత్‌ కచ్చితంగా సరిపోతాడు. షమీ 4 బంతుల్లో 2 పరుగుల్ని కాపాడటం నమ్మశక్యం కానిది' అని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ పేర్కొన్నారు.

బుమ్రాకు ఈ రోజు అచ్చిరాలేదు:

బుమ్రాకు ఈ రోజు అచ్చిరాలేదు:

సూపర్‌ ఓవర్‌లో 'సూపర్‌ విజయం'. వరుస సిక్సర్లతో రోహిత్‌ మ్యాచును ముగించడం బాగుంది. ఎక్కువ సిక్సర్లు మరెవ్వరూ బాధలేరని రోహిత్ మరోసారి నిరూపించాడు: ఆకాశ్‌ చోప్రా

రోహిత్‌ శర్మపై నమ్మకం ఉంచండి. మ్యాచ్‌లను మలుపు తిప్పగల ఎందరో ఆటగాళ్లు భారత జట్టులో ఉన్నారు. బుమ్రాకు ఈ రోజు అచ్చిరాలేదు. షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆదుకున్నాడు: మహ్మద్ కైఫ్‌

సూపర్‌ ఓవర్‌ చివరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరం. రోహిత్‌ రెండు సిక్సర్లు బాదేశాడు. సూపర్ థ్రిల్లర్‌ మ్యాచ్ ఇది. రోహిత్‌, షమీ, రాహుల్‌, జడేజా విజయంలో ఎంతో కృషి చేశారు: యూసుఫ్‌ పఠాన్‌

నిజమైన క్రీడల్లో ఉండే నాటకీయత ఇదే. విజయానికి 2 బంతుల్లో 10 పరుగులు చేసేందుకు, 5 బంతుల్లో 3 పరుగుల్ని కాపాడుకునేందుకు ఎంతో నైపుణ్యం అవసరం: హర్షభోగ్లే

రోహిత్‌, షమీ టాప్ ప్రదర్శన ఇది. అద్భుతమైన టీ20 సిరీస్‌ విజయం. టీమ్‌ఇండియాకు అభినందనలు: హర్భజన్‌ సింగ్‌

అద్భుతమైన క్రికెట్‌. సూపర్‌ ఓవర్లో రోహిత్‌ శర్మ ఎంతో ప్రశాంతంగా ఆడాడు. విజయ తీరాలకు చేర్చాడు: రవిచంద్రన్‌ అశ్విన్‌

రోహిత్ చాలా బాగా ఆడావు. ఉత్కంఠకర విజయం సాధించేందుకు డెత్‌ ఓవర్లలో షమీది అద్భుత బౌలింగ్‌: జులన్‌ గోస్వామి

Story first published: Thursday, January 30, 2020, 12:08 [IST]
Other articles published on Jan 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X