న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడు టీ20ల సిరిస్ కోసం భారత్‌కు చేరుకున్న శ్రీలంక జట్టు

 Lasith Malinga-led Sri Lanka team arrives in India ahead of T20I series


హైదరాబాద్:
లసిత్ మలింగ్ నేతృత్వంలోని శ్రీలంక జట్టు గురువారం భారత్‌కు చేరుకుంది. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక జట్టు మూడు టీ20 సిరిస్ ఆడనుంది. శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా లసిత్ మలింగ వ్యవహారించనున్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా తొలి టీ20 ఆదివారం గౌహతి వేదికగా జరగనుంది.

భారత పర్యటనకు ముందు శ్రీలంక జట్టు బౌద్ధ గురువు ఆశీర్వాదం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు శ్రీలంక క్రికెట్ బోర్డు తన ట్విట్టర్‌లో పంచుకుంది. భారత పర్యటనకు మొత్తం 16 మంది సభ్యులతో కూడిన జట్టుని శ్రీలంక బోర్డు ప్రకటించింది. మాజీ కెప్టెన్‌ ఏంజెలో మాథ్యూస్‌ సుదీర్ఘ విరామం తర్వాత టీ20ల్లో చోటు దక్కించుకున్నాడు.

స్ఫూర్తిదాయక వీడియో: సచిన్ షేర్ చేయడంపై మద్దా రామ్ ఏమన్నాడో తెలుసా?స్ఫూర్తిదాయక వీడియో: సచిన్ షేర్ చేయడంపై మద్దా రామ్ ఏమన్నాడో తెలుసా?

32 ఏళ్ల మాథ్యూస్‌ చివరిగా 2018 ఆగస్టులో దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్‌ ఆడాడు. మరోవైపు శ్రీలంకతో మూడు టీ20ల సిరిస్‌కు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు పేసర్ మహ్మద్ షమీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. దీంతో ఈ సిరిస్‌లో ఓపెనర్లుగా శిఖర్ ధావన్-కేఎల్ రాహుల్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నారు.

మరోవైపు టీమిండియా ప్రధాన పేసర్ బుమ్రా కూడా ఈ సిరిస్‌లో ఆడనున్నాడు. శ్రీలంకతో మూడు టీ20ల సిరిస్ జనవరి 5 నుంచి 10 వరకు జరగనుంది. తొలి టీ20 జనవరి 5న గౌహతి వేదికగా ప్రారంభం కానుంది. ఆ తర్వాత 7వ తేదీన ఇండోర్, 10వ తేదీన పూణె వేదికగా జరగనుంది.

ఇంగ్లండ్‌కు పీటర్సన్‌ సలహా.. గెలవాలంటే ఆ ఇదర్దిలో ఒకరిని పక్కనపెట్టండి!!ఇంగ్లండ్‌కు పీటర్సన్‌ సలహా.. గెలవాలంటే ఆ ఇదర్దిలో ఒకరిని పక్కనపెట్టండి!!

భారత పర్యటనకు శ్రీలంక జట్టు:
లసిత్ మలింగ, దనుష్క గుణతిలక, అవిష్క ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్‌, దసున్‌ శనక, కుశాల్‌ పెరీరా, నిరోషన్‌ డిక్వెలా, ధనంజయ డిసిల్వా, ఇసుర ఉదాన, భనుక రాజసక్స, ఒషాద ఫెర్నాండో, హసరంగ, లహిరు కుమార, కుశాల్‌ మెండిస్‌, సందకన్‌, కసున రజిత.

లంకతో టీ20 సిరిస్‌కు టీమిండియా:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శివం దుబే, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీద్ బుమ్రా, నవ్‌ద్రిత్ బుమ్రా మనీష్ పాండే, వాషింగ్టన్ సుందర్, సంజు సామ్సన్.

Story first published: Saturday, January 4, 2020, 11:38 [IST]
Other articles published on Jan 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X