న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంటర్యూలో వెల్లడి: బుమ్రాకు యార్కర్లు విసరడం నేర్పించింది మలింగ కాదంట!

Lasith Malinga didnt teach me the art of bowling yorkers, reveals Jasprit Bumrah

హైదరాబాద్: జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం భారత జట్టులో ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్నాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుగాంచాడు. ప్రస్తుతం భారత బౌలర్లలో యార్కర్ల స్పెషలిస్ట్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు కూడా బుమ్రానే. బుమ్రా ఇలా యార్కర్లపై పట్టు సాధించడానికి కారణం లసిత్ మలింగానేనని చాలా మంది భావిస్తుంటారు.

అందుకు కారణం ఇండియన్ ప్రీమయిర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌ జట్టుకు వీరిద్దరూ కలిసి ఆడుతుండటమే. లసిత్ మలింగ సలహాలతోనే యార్కర్లపై పట్టు సాధించారా? అని జస్ప్రీత్ బుమ్రాను ఇటీవలే ఓ ఇంటర్యూలో జర్నలిస్ట్‌లు ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.

<strong>ICC Under-19 Cricket World Cup 2020: భారత షెడ్యూల్, టీమ్స్, గ్రూప్స్ తదితర వివరాలు!</strong>ICC Under-19 Cricket World Cup 2020: భారత షెడ్యూల్, టీమ్స్, గ్రూప్స్ తదితర వివరాలు!

యార్కర్లు విసిరే టెక్నిక్స్

యార్కర్లు విసిరే టెక్నిక్స్

"చాలా మంది లసిత్ మలింగ నాకు యార్కర్లు విసిరే టెక్నిక్స్ నేర్పించాడని భావిస్తుంటారు. ఇందులో ఎలాంటి నిజం లేదు. నేను టీవీల్లో మ్యాచ్‌ల్ని చూస్తూ స్వయంగా ప్రాక్టీస్ చేసి యార్కర్లు విసరడంపై పట్టు సాధించాను. కాకపోతే మైదానంలో ఒత్తిడిని ఎలా అధిగమించాలి? అనేదానిపై మాత్రం మలింగ నుంచి సలహాలు తీసుకున్నా" అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

కోపం తెచ్చుకోకుండా ఉండటం

కోపం తెచ్చుకోకుండా ఉండటం

అలానే తన బౌలింగ్ ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మన్ పరుగులు చేస్తున్నప్పుడు కోపం తెచ్చుకోకుండా ఉండటం, బ్యాట్స్‌మెన్‌ని బోల్తా కొట్టించడం లాంటివి మలింగా నుంచి నేర్చుకున్నానని బుమ్రా అన్నాడు. మ్యాచ్‌లో మనకూ ఎవరూ సాయం చేయరు కాబట్టి స్వతహాగా నేర్చుకోవడానికే తాను ఎక్కువగా ఇష్టపడతానని బుమ్రా వెల్లడించాడు.

డెత్ ఓవర్లలో ఒత్తిడిని అధిగమిస్తూ

డెత్ ఓవర్లలో ఒత్తిడిని అధిగమిస్తూ

2016లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన జస్ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్లలో ఒత్తిడిని అధిగమిస్తూ జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహారిస్తున్నాడు. టీమిండియా తరుపున ఇప్పటికే 12 టెస్టులాడిన బుమ్రా 62 వికెట్లు, 58 వన్డేల్లో 103 వికెట్లు, 42 టీ20ల్లో 51 వికెట్లు, 77 ఐపీఎల్ మ్యాచ్‌లో 82 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Friday, January 3, 2020, 18:15 [IST]
Other articles published on Jan 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X