న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరుదైన గౌరవం: తొలి ఐసీసీ మహిళా మ్యాచ్ రిఫరీగా లక్ష్మీ

Lakshmi of India appointed as first woman ICC Match Referee

హైదరాబాద్: భారత్‌కు చెందిన జీఎస్ లక్ష్మీని మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మ్యాచ్ రిఫరీగా ఎంపిక చేసింది. తద్వారా మొట్టమొదటి మహిళా ఐసీసీ మ్యాచ్ రిఫరీగా లక్ష్మీకి అరుదైన గుర్తింపు లభించింది. ఈ ఎంపిక తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

51 ఏళ్ల లక్ష్మీ 2008-09లో తొలిసారి ఓ దేశవాళీ మహిళల టోర్నీలో మ్యాచ్ రిఫరీగా వ్యవహారించారు. ఇప్పటివరకు ఆమె మూడు మహిళల వన్డేలతో పాటు మూడు టీ20లకు మ్యాచ్ రిఫరీగా వ్యవహారించారు. మ్యాచ్ రిఫరీగా ఎంపిక అవడంపై లక్ష్మీ మాట్లాడుతూ "ఐసీసీ అంతర్జాతీయ ప్యానెల్‌లో రిఫరీగా ఎంపిక అవడం చాలా అరుదైన గౌరవం" అని అన్నారు.

"భారత్‌లో క్రికెటర్‌గా సుదీర్ఘ క్రికెట్ కెరీర్ ఉన్న నాకు మ్యాచ్ రిఫరీగా కూడా అంతే కెరీర్ ఉంటుందని భావిస్తున్నా. ప్లేయర్, మ్యాచ్ అఫీసియల్‌గా నాకున్న అనుభవం అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఉపయోగపడుతుంది. నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన ఐసీసీతో పాటు బీసీసీఐ అధికారులకు ధన్యవాదాలు" అని ఆమె అన్నారు.

"క్రికెట్ సర్కూట్‌లో ఉన్న నా సీనియర్లతో పాటు నాకు మద్దతు తెలిపిన కుటుంబ సభ్యులు, నా స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా" అని ఆమె అన్నారు. మరోవైపు ఈ నెల ఆరంభంలో ఆస్ట్రేలియాకు చెందిన క్లైరీ పోలోసాక్‌ను ఐసీసీ ప్యానెల్ అంఫైర్‌గా ఐసీసీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, May 14, 2019, 19:14 [IST]
Other articles published on May 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X