న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కామెంటేటర్‌గా మారిన కుల్దీప్ యాదవ్!!

Kuldeep Yadav Doing Commentary On His Five Wicket Haul
Kuldeep Doing LIVE Commentary on His Fifer Will Give Aakash Chopra a Run For His Money

హైదరాబాద్: కుల్దీప్‌లోని మరో కోణాన్ని బీసీసీఐ బయటపెట్టింది. స్వయంగా బీసీసీఐ అధికారికంగా తానే అతనితో ఈ పని చేయించింది. శనివారం ముగిసిన మ్యాచ్‌లో విండీస్‌పై విరుచుపడి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో బీసీసీఐ కుల్దీప్‌కు సంబంధించిన 14సెకన్ల వీడియో ఒకటి బీసీసీఐ ట్విటర్‌లో పంచుకోగా అది కాస్తా.. వైరల్‌గా మారింది.

 విండీస్‌తో మ్యాచ్‌ అయిపోయాక

విండీస్‌తో మ్యాచ్‌ అయిపోయాక

విండీస్‌తో మ్యాచ్‌ అయిపోయాక టీమిండియా ఆటగాళ్లందరూ డ్రెస్సింగ్‌ రూమ్‌కి చేరుకున్నారు. మ్యాచ్‌లో భాగంగా కుల్దీప్‌ తీసిన మొదటి వికెట్‌ సంబంధించిన వీడియోను చూపించి తన ఆటకు తననే కామెంట్రీ ఇచ్చుకోవాల్సిందిగా కుల్‌దీప్‌ను బీసీసీఐ కోరిందట. మరో ఆలోచన లేకుండా కుల్‌దీప్‌ కూడా అదే చేశాడు. ఆ వీడియోను ఆదివారం బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది.

కుల్దీప్‌ తీసిన వికెట్‌కి అతడే కామెంట్రీ

‘కుల్దీప్‌యాదవ్‌ తీసిన వికెట్‌కి అతడే కామెంట్రీ ఇచ్చుకుంటాడని ఎవరైనా ఊహిస్తారా? కానీ అతడు ఆపని చేశాడు. కామెంట్రీ ఇవ్వాల్సిందిగా మేం అతడిని అడిగాం. ఇదిగో ఆ వీడియో మీ కోసం'అంటూ ట్వీట్‌ చేసింది.

 కుల్దీప్‌ వేసిన బంతికి తొలివికెట్‌

కుల్దీప్‌ వేసిన బంతికి తొలివికెట్‌

‘కుల్‌దీప్‌ యాదవ్‌ బాల్‌ వేశాడు..అది వికెట్‌కు తగిలింది. కుల్దీప్‌ వేసిన బంతికి అతడికి తొలివికెట్‌ లభించింది'అంటూ ప్రొఫెషనల్ మాదిరి చెప్పడం అందరినీ ఆకట్టుకుంటోంది.

భారత్ చేతిలో 272 పరుగుల తేడాతో

భారత్ చేతిలో 272 పరుగుల తేడాతో

మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. కెప్టెన్ విరాట్ కోహ్లి (139), పృథ్వీ షా (134): , రవీంద్ర జడేజా (100 నాటౌట్) సెంచరీలు బాదడంతో తొలి ఇన్నింగ్స్‌ని 649/9 వద్ద డిక్లేర్ చేయగా.. ఆ తర్వాత వెస్టిండీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌట్ అయింది. రాజ్‌కోట్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన వెస్టిండీస్ జట్టు భారత్ చేతిలో ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.

Story first published: Sunday, October 7, 2018, 14:25 [IST]
Other articles published on Oct 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X