న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3 దేశాల్లో విజయం సాధించిన ఏకైక జట్టు భారత్‌యే

Kohli sets Asian record, Pant equals world record as India win in Adelaide

అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా శుభారంభాన్ని నమోదు చేసుకుంది. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో పర్యాటక భారత జట్టు 31 పరుగుల తేడాతో గెలుపొందింది. తాజా గెలుపుతో కోహ్లీసేన ఆల్‌టైం రికార్డును నెలకొల్పింది. ఆసియా దేశాలలో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల్లో టెస్టు మ్యాచ్‌లు నెగ్గ‌డం ఇదే తొలిసారి. అరుదైన ఫీట్‌ను టీమిండియా ద‌క్కించుకోవ‌డం విశేషం.

కుంబ్లే తర్వాత మళ్లీ కోహ్లీనే

కుంబ్లే తర్వాత మళ్లీ కోహ్లీనే

చివరిసారిగా 2007-08లో అనిల్ కుంబ్లే కెప్టెన్సీలోని భారత్ పెర్త్ టెస్టులో గెలుపొందింది. ఆసీస్ పర్యటనలో టెస్టు సిరీస్ ఆరంభ టెస్టులోనే జట్టును గెలిపించిన కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో టెస్టు మ్యాచ్‌ల్లో జట్టుకు విజయాన్ని అందించిన ఏకైక ఆసియా కెప్టెన్‌గా విరాట్ ఘనతను అందుకున్నాడు.

పరాభవంతోనే వెనుదిరిగిన ధోనీ

పరాభవంతోనే వెనుదిరిగిన ధోనీ

2011-12లో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలోని భారత్ 4-0తో ఘోర పరాభవాన్ని చవిచూసింది. 2014-15లోనూ 2-0తో సిరీస్ చేజార్చుకుంది. రెండో టెస్టులోనూ ఇదే ఉత్సాహంతో సత్తాచాటి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని కోహ్లీసేన ఆశిస్తోంది.

స్వల్ప పరుగుల వ్యవధితోనే

స్వల్ప పరుగుల వ్యవధితోనే

తక్కువ పరుగుల తేడాతో భారత్‌ టెస్టు విజయాన్ని నమోదు చేసిన జాబితాలో ఈ మ్యాచ్‌ మూడోది. 2004లో భారత్‌ ఆస్ట్రేలియాపై 13 పరుగుల తేడాతో గెలుపొందగా.. 1973లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో భారత్‌ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు అడిలైడ్‌లో 31 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గింది.

తొలి టెస్టులో తొలి సారి విజయం అందుకున్న భారత్

తొలి టెస్టులో తొలి సారి విజయం అందుకున్న భారత్

ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో విదేశీ గడ్డపై 3 టెస్టు మ్యాచ్‌లు గెలవడం భారత్‌కు 1968 తర్వాత ఇదే తొలిసారి. ఆసీస్‌ పర్యటనలో సిరీస్‌లో తొలి టెస్టు గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌ గెలిచిన రెండో ఆసియా జట్టు భారత్‌. గతంలో పాకిస్థాన్‌ మెల్‌బోర్న్‌లో తొలి టెస్టు గెలిచింది.

Story first published: Monday, December 10, 2018, 16:43 [IST]
Other articles published on Dec 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X