న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ సెంచరీ: మైదానంలోకి చొచ్చుకొచ్చిన అభిమాని, అడ్డుకున్న అంఫైర్

By Nageshwara Rao

హైదరాబాద్: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భద్రతా లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా చివరిదైన మూడో వన్డే ఆదివారం కాన్పూర్‌లోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌‌లో న్యూజిలాండ్‌పై భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీని నమోదు చేశాడు. కోహ్లీకి వన్డేల్లో ఇది 32వ సెంచరీ కావడం విశేషం. కోహ్లీ సెంచరీ బాదిన వేళ ఓ ఆసక్తికర సంఘనట చోటు చేసుకుంది. కోహ్లీ తన సెంచరీ అనంతరం ప్రేక్షకులకు అభివాదం చేస్తుండగా, ఓ తుంటరి అభిమాని మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు.

9000: డివిలియర్స్ రికార్డు బద్దలు, ఆరో భారత క్రికెటర్‌గా కోహ్లీ9000: డివిలియర్స్ రికార్డు బద్దలు, ఆరో భారత క్రికెటర్‌గా కోహ్లీ

అంతేకాదు కోహ్లీ పేరుతో ఉన్న జెర్సీని ధరించిన అతడు కోహ్లీ వైపుగా పరిగెత్తుకుంటూ వస్తుండడంతో ఏం జరుగుతుందో కాసేపు ఎవరికీ అర్థం కాలేదు. ఆ వెంటనే స్క్వేర్ లెగ్ వద్ద ఉన్న అంపైర్ అతడిని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఆటకు కొంతసేపు అంతరాయం కలిగింది.

Kohli's mad fan came In the ground during India Vs New zealand 3rd odi at Kanpur

ఆ అభిమానిని అదుపులోకి తీసుకుని స్టేడియం భద్రతా సిబ్బంది అతడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆట తిరిగి ప్రారంభమైంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా గుజరాత్-ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా ఇలాగే అభిమాని ఒకరు గ్రౌండ్‌లోకి చొచ్చుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే కాన్పూర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్‌పై 6 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరిస్‌ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది. ఈ సిరిస్ విజయం భారత్‌కు వరుసగా ఏడో సిరిస్ విజయం కావడం విశేషం.

బుమ్రా మ్యాజిక్: కాన్పూర్ వన్డేలో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ, 2-1తో సిరిస్ కైవసంబుమ్రా మ్యాజిక్: కాన్పూర్ వన్డేలో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ, 2-1తో సిరిస్ కైవసం

338 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరంభంలో దూకుడుగా ఆడినప్పటికీ చివర్లో తడబడింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. చివరి ఓవర్లో 15 పరుగులు సాధించాల్సిన దశలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేసి 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

బుమ్రా ఇన్నింగ్స్ 47 ఓవర్లో ధోనితో చక్కటి సమన్వయంతో లాథమ్ (65)ను రనౌట్ చేయడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. వాస్తవానికి కివీస్ జట్టు 40 ఓవర్లలో 247/3తో పటిష్టంగా కనిపించింది. లాథమ్ క్రీజులో ఉన్నంత సేపు భారత్ విజయానికి దూరంగా ఉండిపోయింది.

చివర్లో కివిస్ విజయానికి 13 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో అతడు రనౌట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్‌లో బుమ్రా మ్యాజిక్ చేయడంతో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకముందు టాస్ గెలిచిన భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X