న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కుల్దీప్ యాదవ్‌ను అనవసరంగా తప్పించామని బాధపడటంలేదు: కేఎల్ రాహుల్

KL Rahul says I dont regret the decision on dropping Kuldeep despite him taking 8 wickets

మిర్పూర్: కుల్దీప్ యాదవ్‌ను తప్పించామని బాధపడలేదని టీమిండియా తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నా.. రాహుల్ మాత్రం సమర్థించుకున్నాడు.

బంగ్లాదేశ్‌తో ఆదివారం ముగిసిన రెండో టెస్ట్‌లో టీమిండియా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను సంక్షిష్టంగా మార్చి విజయం కోసం ఆపసోపాలు పడింది. చెత్త ఫీల్డింగ్‌కు తోడు పేలవ బ్యాటింగ్‌తో ఓటమి దిశగా సాగిన టీమిండియాను లోయరార్డర్ బ్యాటర్ రవిచంద్రన్ అశ్విన్, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గట్టెక్కించారు.

ఏం బాధపడటం లేదు..

ఏం బాధపడటం లేదు..

అయితే స్పిన్‌కు ఎక్కువగా అనుకూలించిన పిచ్‌పై కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు ఆడించలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్.. ఈ విషయంపై రిపోర్టర్లు నిలదీయగా సమర్థించుకున్నాడు. కుల్దీప్‌ విషయంలో తీసుకున్న నిర్ణయంపై ఎలాంటి బాధ లేదని, అది సరైందేనని కేఎల్‌ రాహుల్‌ తెలిపాడు. 'కుల్దీప్‌ను తప్పించేలా తీసుకున్న నిర్ణయంపై బాధ లేదు. అది సరైందే. ఈ పిచ్‌పై మా పేసర్లు కూడా వికెట్లు తీశారు. వీళ్లకూ పిచ్‌ సహకరించింది. అనూహ్యమైన బౌన్స్‌ లభించింది. ఇక్కడ వన్డేలు ఆడిన అనుభవం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. స్పిన్‌, బౌన్స్‌కు సహకారం లభించడం చూశాం. జట్టు కూర్పు సమతూకంతో ఉండాలనుకున్నాం.

చాలా కఠిన నిర్ణయమే..

చాలా కఠిన నిర్ణయమే..

తొలి టెస్టును గెలిపించిన కుల్‌దీప్‌ను పక్కకు పెట్టాలన్నది కఠిన నిర్ణయం. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ (సబ్‌స్టిట్యూట్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌ చేయడం) అవకాశం ఉంటే రెండో ఇన్నింగ్స్‌లో అతనితో బౌలింగ్‌ చేయించేవాన్ని,'అని అతను తెలిపాడు. సీనియర్ ఆటగాళ్ల బ్యాటింగ్ వైఫల్యంపై స్పందిస్తూ ఫార్మాట్లకు తగ్గట్లుగా వేగంగా ఆటను మార్చుకోవడం సవాలేనని చెప్పాడు. 'మూడు ఫార్మాట్లు ఆడుతుంటే. ఒక దాని నుంచి మరొకదానికి మారడం కష్టంగా ఉంటుంది. ఆ ఫార్మాట్‌కు తగ్గట్లుగా ఆటను మార్చుకోవడానికి సమయం పడుతుందని నా అభిప్రాయం.

ఫార్మాట్‌కు తగ్గట్లు ఆడటం కష్టం..

ఫార్మాట్‌కు తగ్గట్లు ఆడటం కష్టం..

పరిస్థితులను ఎంత త్వరగా అర్థం చేసుకుంటామనేది సవాలే. ఈ సిరీస్‌లో నా ప్రదర్శన గొప్పగా లేదని ఒప్పుకుంటా. దురదృష్టవశాత్తూ మా షెడ్యూల్‌ కూడా తీరిక లేని విధంగా ఉంది. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు, టెస్టులకు మధ్య కాస్త విరామం ఉండాలి'' అని రాహుల్ పేర్కొన్నాడు. ఇక అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ శ్రేయస్‌ ఉత్తమంగా ఆడుతున్నాడని రాహుల్‌ కొనియాడాడు. ఈ సిరీస్‌లో రాహుల్‌ (57 పరుగులు), కోహ్లీ(45) దారుణంగా విఫలమయ్యారు.

సంక్షప్తి స్కోర్లు:

సంక్షప్తి స్కోర్లు:

బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: 227

భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌: 314

బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌: 231

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 145/7

Story first published: Monday, December 26, 2022, 8:20 [IST]
Other articles published on Dec 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X