న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గాయంతో కేఎల్ రాహుల్ ఔట్, దక్షిణాఫ్రికా సిరీస్‌కు కెప్టెన్‌గా పంత్, వైస్ కెప్టెన్, మిగతా టీం వివరాలివే..!

KL Rahul ruled out from South Africa series due to injury, Pant as captain and Hardik Pandya as vice-captain

టీమిండియా ఆల్ ఫార్మాట్ కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ విశ్రాంతినివ్వడంతో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి పూర్తిగా వైదొలిగాడు. గురువారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సిరీస్ ఓపెనర్‌ మ్యాచ్ జరిగే ఒక రోజు ముందు ఈ విషయం వెల్లడైంది. ఇక రాహుల్ దూరం కావడంతో ఈ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికయిన రిషబ్ పంత్ జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నాడు.

 బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది

బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది

'కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌కు మొత్తం దూరం కానున్నాడు. ఇక కెప్టెన్‌గా రిషబ్ పంత్ వ్యవహరిస్తాడు' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు గురువారం ప్రముఖ వార్తాసంస్థతో తెలిపాడు. బీసీసీఐ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనప్పటికీ ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ సైతం ఈ విషయాన్ని కన్ఫమ్ చేస్తూ ఆర్టికల్ పోస్ట్ చేసింది. ఇక మంగళవారం, బుధవారం భారత ప్రాక్టీస్ సెషన్‌లో కేఎల్ రాహుల్ పాల్గొనలేదు. అతను సోమవారం జరిగిన మొదటి ఐచ్ఛిక నెట్ సెషన్లో పాల్గొన్నప్పటికీ అతను ఎక్కువగా స్పిన్నర్ల బౌలింగ్లోనే బ్యాటింగ్ చేశాడు.

కుల్దీప్ యాదవ్ కూడా ఔట్

కుల్దీప్ యాదవ్ కూడా ఔట్

ఇక ఐచ్చిక సెషన్లో కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్‌ బౌలింగ్లో రాహుల్ ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు. కానీ అనూహ్యంగా అతను గాయపడడంతో ఈ సిరీస్ నుంచి పూర్తిగా కేఎల్ రాహుల్ తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక రాహుల్ తప్పుకోవడంతో ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్‌ బరిలోకి దిగే అవకాశముంది. రాహుల్‌తో పాటు గాయం కారణంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.

 దక్షిణాఫ్రికా సిరీస్ కోసం టీమిండియా ఫైనల్ స్క్వాడ్ ఇదే..

దక్షిణాఫ్రికా సిరీస్ కోసం టీమిండియా ఫైనల్ స్క్వాడ్ ఇదే..

ఇక దక్షిణాఫ్రికా సిరీస్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనుండగా.. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక గాయపడిన రాహుల్, కుల్దీప్ స్థానాల్లో సెలెక్షన్ కమిటీ ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. ముందు ప్రకటించిన జట్టే తుది స్క్వాడ్‌గా ఉండబోతుంది. రాహుల్ గైర్హాజరీ వల్ల రిషబ్ పంత్ అనూహ్యంగా భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టబోతుండడంతో పంత్ అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. 24ఏళ్ల పంత్ భవిష్యత్తు కెప్టెన్ కావడానికి ఇదే సంకేతం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎవరికీ ఏదీ దక్కాలో అది దక్కేందుకు గాడ్ ఏదో ఒకటి చేస్తాడంటున్నారు.

దక్షిణాఫ్రికా సిరీస్ అప్డేటెడ్ భారత టీ20 జట్టు:

దక్షిణాఫ్రికా సిరీస్ అప్డేటెడ్ భారత టీ20 జట్టు:

రిషబ్ పంత్ (కెప్టెన్) (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్సర్ పటేల్, రవి బిష్నో పటేల్ , భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

ఎలా గాయపడ్డారంటే..?

ఎలా గాయపడ్డారంటే..?

ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రాక్టీస్ సెషన్లో కుడి గజ్జలో పట్టేయడం, అది భరించలేని నొప్పిలా మారడంతో రాహుల్ జట్టుకు దూరమయినట్లు తెలుస్తోంది. నెట్స్‌లో బౌలింగ్ కాకుండా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కుల్దీప్ యాదవ్ గాయపడ్డాడని తెలుస్తోంది. ఇక వీరిద్దరు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ వైద్య బృందం వారి పరిస్థితిని మరింత అంచనా వేసి, భవిష్యత్తు చికిత్సపై నిర్ణయం తీసుకుంటుంది. మంగళవారం సాయంత్రం నెట్స్‌లో ప్రాక్టీసు చేస్తున్నప్పుడు నొప్పి వచ్చినట్లు రాహుల్.. స్టాఫ్‌కు చెప్పడంతో అతనికి స్కాన్ తీశారు. గాయం తీవ్రత వల్ల రాహుల్‌ను సిరీస్ నుంచి తప్పించాలని టీం మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఇక ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఇంగ్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్ కోసం రాహుల్ అందుబాటులోకి వస్తాడో రాడో ఇంకా తెలియరాలేదు.

Story first published: Wednesday, June 8, 2022, 19:40 [IST]
Other articles published on Jun 8, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X