న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ మూడు మ్యాచుల గురించి వర్రీ అవలేదు.. హాఫ్ సెంచరీ తర్వాత రాహుల్ కామెంట్స్

By Lekhaka
KL Rahul not worried about his initial failure in T20 World Cup

పొట్టి ప్రపంచకప్‌లో భారత జట్టుకు ఆందోళన కలిగించిన అంశాల్లో స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫామ్ కూడా ఒకటి. భారత అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై కేవలం 4 పరుగులకే రాహుల్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కూడా రాహుల్ తన టచ్ అందుకోలేకపోయాడు. మెగా టోర్నీ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించిన అతను.. అసలు సిసలు ఆట మొదలవగానే చతికిల పడ్డాడు.

రాహుల్ విఫలం అవడంతో తీవ్రమైన ఒత్తిడిలో భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి రోహిత్ శర్మ కూడా ఇబ్బంది పడటం ప్రారంభించాడు. దీంతో అసలు రాహుల్‌ను జట్టులో నుంచి తీసేయాలని.. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీలలో ఒకరిని ఓపెనర్‌గా పంపాలని అభిమానులు డిమాండ్లు మొదలు పెట్టారు. లేదంటే ఇప్పటి వరకు టోర్నీలో అవకాశం దక్కని రిషభ్ పంత్‌ను ఆడించాలన్నారు.

నమ్మకం ఉంచిన టీం మేనేజ్‌మెంట్..

నమ్మకం ఉంచిన టీం మేనేజ్‌మెంట్..

కానీ జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. రాహుల్‌పై పూర్తి నమ్మకం ఉంచింది. రాహుల్‌ కచ్చితంగా మెరుగవుతాడని నమ్మింది. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకున్న అతను.. బంగ్లాదేశ్‌పై చెలరేగాడు. కేవలం 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. తొలి రెండు ఓవర్లలో నిదానంగా ఆడిన అతను.. రోహిత్ (2) అవుటైన తర్వాత చెలరేగాడు. కోహ్లీ అండగా ధనాధన్ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అతని జోరు చూస్తే సెంచరీ చేసేలా కనిపించినా.. దురదృష్టవశాత్తూ హాఫ్ సెంచరీ పూర్తవగానే పెవిలియన్ చేరాడు.

రాహుల్ ఏమన్నాడంటే?

రాహుల్ ఏమన్నాడంటే?

తన ఇన్నింగ్స్‌ గురించి రాహుల్ మాట్లాడాడు. తొలి మూడు మ్యాచుల్లో విఫలమైనా కూడా తనపై ఒత్తిడి లేదన్నాడీ స్టార్ ఓపెనర్. 'ఇది కొంచెం మిక్స్‌డ్ టైం లా ఉంది. భారత్‌లో కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడి, ఆ విశ్వాసంతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టా. వార్మప్ గేమ్స్‌లో కూడా బాగానే ఆడా. నేను బాగానే ఆడుతున్నాననే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఒక బ్యాటర్‌గా మనం బాగా ఆడుతున్నామో లేదో? మనకు తెలుస్తుంది. నేను బంతిని చక్కగా చూస్తున్నా, దానికి తగ్గట్లే షాట్లు ఆడుతున్నారు. అందుకే తొలి మూడు మ్యాచుల గురించి వర్రీ అవలేదు. ఈ మ్యాచ్‌లో చాలా ఎగ్జయిట్‌ అయ్యా. ఒక మంచి ఇన్నింగ్స్ ఆడినందుకు సంతోషంగా ఉంది' అని చెప్పాడు.

రాహుల్‌తోపాటు రాణించిన కోహ్లీ, సూర్య

రాహుల్‌తోపాటు రాణించిన కోహ్లీ, సూర్య

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌తోపాటు కోహ్లీ (64 నాటౌట్) కూడా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 30) కూడా ధాటిగా ఆడాడు. దీంతో భారత జట్టు 184 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బంగ్లా ఓపెనర్లు కొంత భయపెట్టినా.. వర్షం అంతరాయం కలిగించిన తర్వాత మ్యాచ్‌ స్వరూపం మారిపోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతోపాటు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో.. ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ప్రపంచకప్ సెమీస్‌లో దాదాపుగా భారత్‌కు బెర్తు కన్ఫర్మ్ అయినట్లే.

Story first published: Wednesday, November 2, 2022, 18:39 [IST]
Other articles published on Nov 2, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X