న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Kiran Navgire: టీమిండియాకు అసలుసిసలు హిట్టర్ దొరికింది, తొలి మ్యాచ్‌లో‌నే మేటి ఘనత

Kiran Navgire crack the record of Fastest Half Century Player in Womens T20 Cricket, Praises flowing on social media

ఐపీఎల్ 2022 మహిళల టీ20 ఛాలెంజ్‌లో మూడోది, మరియు చివరిదైన గ్రూప్ స్టేజ్ మ్యాచ్ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో వెలాసిటీ వర్సెస్ ట్రైల్‌బ్లేజర్స్ మధ్య జరగగా ఈ మ్యాచ్‌లో వెలాసిటీ తరఫున అరంగేట్రం చేసిన ప్లేయర్ కిరణ్ నవిగిరే అద్భుతంగా ఆడింది. ఆమె (69పరుగులు 34బంతుల్లో 5ఫోర్లు, 5సిక్సర్లు) ఇన్నింగ్స్ ఆడుతున్నంత సేపు విధ్వంసం రేపింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ట్రైల్‌బ్లేజర్స్ నిర్ణీత 20వ ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 190పరుగుల భారీ స్కోరు సాధించగా.. ఇక 191పరుగుల లక్ష్య ఛేదనలో వెలాసిటీ జట్టు తరఫున కిరణ్ నవిగిరే వీరోచితంగా పోరాడింది. ఇక చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో వెలాసిటీ 9వికెట్లు కోల్పోయి 174పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక చివరికి 16పరుగుల తేడాతో ట్రైల్‌బ్లేజర్స్ గెలిచింది. ఈ టోర్నీలో సూపర్ నోవాస్, ట్రైల్ బ్లేజర్స్, వెలాసిటీ జట్లు తలా ఓ విజయం సాధించగా.. నెట్ రన్ రేట్ వల్ల సూపర్ నోవాస్, వెలాసిటీ టాప్ 2లో ఉండి ఫైనల్ చేరుకున్నాయి.

టీమిండియా మహిళ క్రికెట్లో సిసలైన హిట్టర్

ఇక 191పరుగుల లక్ష్య ఛేదన అది కూడా మహిళల క్రికెట్లో చాలా కష్టం. ఇక దాదాపు వెలాసిటీ భారీ తేడాతో ఓడడం ఖాయమని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఆ జట్టు స్టార్ ప్లేయర్ సఫాలీ వర్మ (29పరుగులు 15బంతుల్లో 5ఫోర్లు) 5వ ఓవర్లో అవుట్ అయింది. అప్పుడు జట్టు స్కోరు 2వికెట్లు కోల్పోయి 50పరుగులకు చేరుకుంది. అప్పుడు కిరణ్ నవిగిరే అనూహ్య రీతిలో హిట్టింగ్ మొదలెట్టింది. డెబ్యూట్ ప్లేయర్ గా బరిలో దిగిన కిరణ్ ఆరో ఓవర్లో సల్మా ఖాతూన్ బౌలింగ్లో లాంగ్ ఆన్లో భారీ సిక్సర్, ఆ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టి తన ఎటాకింగ్ ప్రారంభించింది. ఇక పవర్ ప్లేలో ఆ జట్టు స్కోరు 2వికెట్లు కోల్పోయి 68పరుగులకు చేరుకుంది.

సఫాలీ వర్మ రికార్డ్ బద్దలు కొడుతూ..

ఈ క్రమంలో కిరణ్ నవిగిరే ఎడాపెడా సిక్సర్లు కొడుతూ ట్రైల్‌బ్లేజర్స్ బౌలర్లను బెంబేలెత్తించింది. ఆడుతున్నంత సేపు ఏమాత్రం బెదరకుండా హిట్టింగ్ చేసింది. ఇక 25బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కిరణ్ నవిగిరే.. మహిళల టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన తొలి భారతీయ ప్లేయర్ గా రికార్డ్ నెలకొల్పింది. అంతకుముందు ఈ రికార్డ్ సఫాలీ వర్మ (30బంతుల్లో 50)పేరిట ఉంది. 17వ ఓవర్ నాలుగో బంతికి కిరణ్ నవిగిరే హిట్టింగ్ చేసేందుకు ముందుకు రాగా బంతి మిస్సయి కీపర్ చేతులోకి వెళ్లింది. దీంతో కీపర్ స్టంపౌట్ చేసింది. కిరణ్ అవుట్ అవ్వడంతో వెలాసిటీ విజయానికి దూరమయింది.

సోషల్ మీడియాలో మారుమోగిన కిరణ్ నవిగిరే పేరు

ఇక మహారాష్ట్రకు చెందిన 25ఏళ్ల కిరణ్ నవిగిరే పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ఒక్క ఇన్నింగ్స్ ద్వారా తానేంటో ప్రపంచానికి చాటుకుందని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. ఇక ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు, మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కిరణ్ నవిగిరే ఆటకు ఫిదా అయ్యాడు. కిరణ్ నవిగిరే, సబ్బినేని మేఘన లాంటి ప్లేయర్ల ఆటను చూస్తుంటే.. ఐపీఎల్ ట్యాగ్ లైన్.. ట్యాలెంట్ మీట్స్ ఆపర్చునిటీ అని పెట్టాలనిపిస్తోందని పేర్కొన్నాడు. వీరిద్దరికి టీమిండియా మహిళల జట్టులో చోటు దక్కాలని పేర్కొన్నాడు. అలాగే చాలా మంది ప్రముఖులు సైతం కిరణ్ నవిగిరే ఇన్నింగ్స్ పట్ల మంత్రముగ్ధులయ్యామని, ఇలాంటి ప్లేయర్ టీమిండియాకు రావాలని కోరారు.

సబ్బినేని మేఘన, రోడ్రిగ్స్ రాణించడంతో

ఇక ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆడిన ట్రైల్‌బ్లేజర్స్ బ్యాటింగ్లో రాణించింది. కెప్టెన్ స్మృతి మంధాన (1పరుగు)కే ఔటయినా సబ్బినేని మేఘన (73పరుగులు 47బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లు) చెలరేగి ఆడింది. అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జెమిమియా రోడ్రిగ్స్ (66పరుగులు 44బంతుల్లో 7ఫోర్లు 1సిక్సర్) వీరవిహారం చేసింది. చివర్లో హైలీ మాథ్యుస్ (27పరుగులు 16బంతుల్లో 4ఫోర్లు), డంక్లీ (19పరుగులు 8బంతుల్లో 2ఫోర్లు 1సిక్సర్) చెలరేగడంతో ట్రైల్ బ్లేజర్స్ 190పరుగుల భారీ స్కోరు సాధించింది.

Story first published: Friday, May 27, 2022, 18:23 [IST]
Other articles published on May 27, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X