న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కుక్ రిటైర్‌మెంట్‌తో సచిన్ రికార్డు సేఫ్..!!

Kevin Pietersen and Sachin Tendulkar pay tribute to retiring England opener Alastair Cook

హైదరాబాద్: ఇండియాతో ఇండియా ఆడుతోన్న టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ తరఫున 160 టెస్టులు ఆడిన కుక్ 44.88 యావరేజ్‌తో 12,254 పరుగులు చేశాడు. అంతేకాక.. అతి చిన్న వయస్సులో 10వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్‌గా కుక్ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

 కుక్ రిటైర్‌మెంట్‌తో సచిన్ పేరిట ఉన్న రికార్డు భద్రంగా:

కుక్ రిటైర్‌మెంట్‌తో సచిన్ పేరిట ఉన్న రికార్డు భద్రంగా:

కుక్ రిటైర్‌మెంట్ ప్రకటించడంతో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డు భద్రంగా ఉండిపోయింది. అంతర్జాతీయ టెస్టుల్లో అత్యధిక స్కోర్ చేసిన క్రికెటర్‌ల జాబితాలో సచిన్ టెండూల్కర్ మొదటిస్థానంలో ఉన్నారు. మొత్తం 200 టెస్ట్ మ్యాచులు ఆడిన సచిన్ 53.78 యావరేజ్‌తో 15,921 పరుగులు చేశారు. ఇందులో 51 సెంచరీలు, 58 అర్ధశతకాలు కూడా ఉన్నాయి.

సచిన్ తర్వాత స్థానంలో ఉన్న నలుగురు:

సచిన్ తర్వాత స్థానంలో ఉన్న నలుగురు:

ఈ జాబితాలో సచిన్ తర్వాత స్థానంలో ఉన్న నలుగురు క్రికెటర్లు ఇంతకు ముందే రిటైర్ అయిపోయారు. దీంతో సచిన్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఒక కుక్‌కి మాత్రమే ఉండేది. ఈ జాబితాలో కుక్ ఐదో స్థానంలో నిలిచాడు కానీ కుక్ ఇప్పుడు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో సచిన్ రికార్డును బ్రేక్ చేయగల క్రికెటర్లు ఆయన దగ్గర్లో కూడా లేరు.

కుక్

కుక్

'రిటైర్మెంట్ ప్రకటించడం బాధాకరమే అయినా క్రికెట్ కోసం అన్నీ ఇచ్చానన్న సంతృప్తి నాకు ఉంది. ఎప్పుడూ ఊహించని రికార్డులను సాధించాను. ఇంగ్లాండ్ జట్టులో ఇంతకాలంగా ఆడటం ఎంతో సంతోషంగా.. గౌరవంగా ఉంది. ఇక కొందరు జట్టు సభ్యులతో డ్రెస్సింగ్ రూంని పంచుకోలేను అని తెలిసి కాస్త బాధగా ఉంది. కానీ ఇందుకు ఇదే సరైన సమయం' అని కుక్ చెప్పాడు.

అలరించాలని కోరుకుంటున్నా

అలరించాలని కోరుకుంటున్నా

'నేను పిల్లాడిగా మా గార్డెన్‌లో క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి క్రికెట్ అంటే నాకు ప్రాణం. ఇంగ్లాండ్ షర్ట్‌ని తీసేయం చాలా కష్టమే.. కానీ భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని, యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు దక్కాలనే ఇది చేస్తున్నాను. వాళ్లు మా దేశానికి ప్రతినిధ్యం వహించి మనల్ని మరింత అలరించాలని కోరుకుంటున్నా' అని కుక్ తెలిపాడు.

Story first published: Tuesday, September 4, 2018, 17:52 [IST]
Other articles published on Sep 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X