న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Finger on lips: కోహ్లీ వికెట్ తీసినా... సంబరాలు చేసుకోని విలియమ్స్

India vs West Indies 2nd T20 : Kesrick Williams Gives Virat Kohli the Silent Treatment || Oneindia
Kesrick Williams gives a keep shut send off to Virat Kohli after getting his revenge

హైదరాబాద్: తిరువనంతపురం వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండిస్ పేసర్ కెస్రిక్ విలియమ్స్ తన సంబరాలను రొటీన్‌‌కు భిన్నంగా చేసుకున్నాడు. బ్యాట్స్‌మన్‌ను ఔట్‌ చేయగానే.. జేబులో నుంచి నోట్‌బుక్‌ తీసి టిక్కు పెట్టి ఓ పనైపోయినట్లు సంబరాలు చేసుకోవడం అతడికి అలవాటు.

లవ్ ద డైలాగ్ సర్: 'నోట్‌బుక్‌' సెలబ్రేషన్‌పై అమితాబ్‌ ట్వీట్‌కు విరాట్ కోహ్లీలవ్ ద డైలాగ్ సర్: 'నోట్‌బుక్‌' సెలబ్రేషన్‌పై అమితాబ్‌ ట్వీట్‌కు విరాట్ కోహ్లీ

కానీ, రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ తీసినా తనదైన 'నోట్‌బుక్ టిక్ మార్క్' పద్ధతిలో కాకుండా 'నిశబ్దం'గా సంబురాలు చేసుకున్నాడు. ఇందుకు కారణం హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20లో అతడి బౌలింగ్‌లో పరుగుల వరద పారించిన కోహ్లీ అతడిని అనుకరిస్తూ బదులిచ్చాడు.

కోహ్లీని ఔట్‌ చేసినప్పుడు

కోహ్లీని ఔట్‌ చేసినప్పుడు

ఈ ఏడాది ఆగస్టులో టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో విరాట్ కోహ్లీని ఔట్‌ చేసినప్పుడు విలియమ్స్‌ జేబులోంచి బుక్‌ తీసినట్లు చూపిస్తూ టిక్కు కొట్టి కవ్వించాడు. దానిని దృష్టిలో ఉంచుకుని తొలి టీ20లో విలియమ్స్‌ 16వ ఓవర్లో రెండో బంతిని అతని తలపై నుంచి కోహ్లి నేరుగా బౌండరీకి తరలించాడు.

నోటిపై వేలు వేసుకున్న విలియమ్స్

నోటిపై వేలు వేసుకున్న విలియమ్స్

ఆ తర్వాతి బంతిని లాంగాన్‌లో కళ్లు చెదిరే సిక్సర్‌‌గా మలిచాడు. సిక్స‌ర్ కొట్టిన త‌ర్వాత కోహ్లీ అదే నోట్‌బుక్‌ స్ట‌యిల్‌లో ఆ మూమెంట్‌ను ఎంజాయ్ చేశాడు. జేబులో నుంచి నోట్‌బుక్‌ను తీసి మూడు సార్లు టిక్కులు కొడుతున్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు. దీంతో రెండో టీ20లో కోహ్లీ వికెట్‌ను విలియమ్సే తీసినప్పటికీ తనదైన శైలిలో సంబరాలు చేసుకోకుండా నోటిపై వేలు వేసుకున్నాడు.

8 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి

8 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి

ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియాకు రెండో మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు. ఫీల్డింగ్‌ తప్పిదాల కారణంగా టీమిండియాకు ఓటమి తప్పలేదు. 171 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకో 9 బంతులుండగానే ఛేదించింది.

లెండిల్‌ సిమన్స్‌ 67 నాటౌట్

లెండిల్‌ సిమన్స్‌ 67 నాటౌట్

లెండిల్‌ సిమన్స్‌ (67 నాటౌట్‌; 45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభంలో నెమ్మదిగా ఆడిన సిమన్స్‌ ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. మరో ఓపెనర్‌ లూయిస్‌ (40; 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు)తో కలిసి అతను తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించాడు.

బుధవారం ముంబైలో మూడో టీ20

బుధవారం ముంబైలో మూడో టీ20

ఆ తర్వాత హెట్‌మయర్‌ (23) అతడికి తోడుగా నిలిచాడు. రెండో వికెట్‌ పడ్డాక సిమన్స్‌తో కలిసి పూరన్‌ (38 నాటౌట్‌; 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) మెరుపులు మెరిపించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. శివమ్‌ దూబె (54; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మూడో టీ20 బుధవారం ముంబైలో జరగనుంది.

Story first published: Monday, December 9, 2019, 14:40 [IST]
Other articles published on Dec 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X