న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భార్యలకీ ప్రియురాళ్లకూ దూరంగా ఉండండి: టీమిండియా మేనేజ్‌మెంట్

Keep away families until 3rd England Test: Management to Virat Kohlis India

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు మేనేజ్‌మెంట్ మరిన్నీ ఆంక్షలు విధించింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న కోహ్లీసేనపై ఒత్తిడి పెరగడంతో.. తమ భార్యలను ప్రియురాళ్లను దూరంగా ఉంచమని టీమిండియాకు సూచనలందాయట. టీ 20సిరీస్ తర్వాత నుంచి కాస్త విరామం దొరికితే చాలు.. భారత క్రికెటర్లు తమ సతీమణులతో చెట్టాపట్టాలేసుకుని చక్కర్లు కొడుతున్న విషయం సోషల్ మీడియా వేదికగా అందరూ గమనిస్తూనే ఉన్నారు.

 భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను దూరం పెట్టాలని

భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను దూరం పెట్టాలని

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ అనంతరం విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, ఉమేశ్ యాదవ్ సహా మరికొంత మంది క్రికెటర్లు తమ జీవిత భాగస్వాములతో సరదాగా గడిపారు. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్లు వారి భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను దూరం పెట్టాలని జట్టు మేనేజ్‌మెంట్ సూచించింది. తొలి మూడు టెస్టులకు తమ జీవిత భాగస్వాములను తీసుకురావద్దని మేనేజ్‌మెంట్ కోహ్లీ సేనకు వెల్లడించింది.

నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది

నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది

ఈ మేరకు ‘ముంబై మిర్రర్' కథనాన్ని ప్రచురించింది. ‘కీలకమైన సిరీస్‌కు సన్నద్ధమవడానికి మాకు నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆటగాళ్లంతా వారి భార్యలు, స్నేహితులు, బంధువులకు దూరం అవుతున్నారు. మేమంతా సోమవారం చెమ్స్‌ఫోర్డ్‌కు బయలుదేరుతాం' అని జట్టులోని ఓ వ్యక్తి వెల్లడించినట్లు ముంబై మిర్రర్ పేర్కొంది.

గతంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని

గతంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని

గతంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో పర్యటనలకు వెళ్లినప్పుడు మన ఆటగాళ్లు పేలవ ప్రదర్శనలను ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకునే మున్మందు విమర్శలకు తావివ్వకుండా మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోవడంతో.. భారత ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగింది.

ఆగష్టు 1వ తేదీ నుంచి 11వ తేదీ

ఆగష్టు 1వ తేదీ నుంచి 11వ తేదీ

టెస్టు సిరీస్‌లో ఆటగాళ్ల ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకు మేనేజ్‌మెంట్ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే భార్యలు, ప్రియురాళ్లను దూరం పెట్టాలని సూచించింది. మొదటి మూడు టెస్టులను బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఈ క్రమంలో టెస్టులు ఆగష్టు 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ జరగనున్నాయి.

Story first published: Tuesday, July 24, 2018, 16:10 [IST]
Other articles published on Jul 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X