హైదరాబాద్: నిత్యం సినిమాలతో బిజీగా ఉండే బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ గ్రౌండ్‌లో అడుగుపెట్టింది. అంతేనా.. క్రికెట్ బ్యాట్ చేత బట్టి బౌండరీల మీద బౌండరీలు బాదింది. గ్రౌండ్‌లో ఉన్నవాళ్లందరు కత్రినా బ్యాటింగ్ తీరు చూసి మురిసిపోయారు. ప్రస్తుతం కత్రినాకైఫ్ 'భారత్' సినిమా నటిస్తోంది.
తొలి ఆటగాడిగా చరిత్ర: స్మిత్‌పై ఏడాది నిషేధం కోహ్లీకి కలిసొచ్చింది
ఈ సినిమా సెట్స్‌లో షూటింగ్ ముగిశాక కత్రినా కైఫ్ క్రికెట్ ఆడిన వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తన స్నేహితురాలు అనుష్క శర్మని కోరింది. "వరల్డ్ కప్ దగ్గరకొస్తోంది. నా గురించి మీ ఆయనకు ఓ మాట చెప్పవా..! నా ఆటతీరు కొంచెం మెరుగుపర్చుకోవాలి. నేను మరీ అంత బ్యాడ్ ఆల్‌రౌండర్‌నేం కాదు" అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టి అనుష్కను ట్యాగ్ చేసింది.
View this post on InstagramA post shared by Katrina Kaif (@katrinakaif) on Jan 21, 2019 at 10:18pm PST
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కత్రినా వీడియోకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా ముగ్ధురాలైంది. "వావ్ బేబీ, మేం నిన్ను తీసుకుంటాం" అని కామెంట్ పెట్టగా.. "ప్లీజ్ కనీసం మీ జట్టులోకి తీసుకొండి, నన్ను క్రికెట్ ఆడనివ్వండి' అంటూ కత్రినాకైఫ్ బదులిచ్చింది.
ఇటీవలే కత్రినా, అనుష్క శర్మ కలిసి నటించిన 'జీరో' సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.
View this post on InstagramA post shared by Katrina Kaif (@katrinakaif) on Jan 20, 2019 at 4:36am PST