న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జట్టుని గెలిపించుకోలేకపోయినా... కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన విలియమ్సన్

Kane Williamson overtakes Virat Kohli, Faf du Plessis with 9th fifty-plus score as T20I captain

హైదరాబాద్: హామిల్టన్‌లోని సెడాన్ పార్కు వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో యాభైకిపైగా స్కోరుని అత్యధిక సార్లు నమోదు చేసిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ రికార్డుని అధిగమించాడు.

ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ 95 పరుగులు చేయడంతో అంతర్జాతీయ టీ20ల్లో 9 సార్లు యాభైకి పైగా పరుగులు చేసిన కెప్టెన్‌గా నిలిచాడు. ఐదు టీ20 సిరిస్‌లో భాగంగా ఆక్లాండ్‌ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టీ20లో కేన్ విలియమ్సన్ 51 పరుగులు చేయడంతో కోహ్లీ సరసన నిలిచాడు.

కివీస్ గడ్డపై 3-0తో సిరిస్ కైవసం: సూపర్ ఓవర్‌లో టిమ్ సౌథీ పేలవ రికార్డు!కివీస్ గడ్డపై 3-0తో సిరిస్ కైవసం: సూపర్ ఓవర్‌లో టిమ్ సౌథీ పేలవ రికార్డు!

మూడో టీ20లో కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ

మూడో టీ20లో కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ

తాజాగా మూడో టీ20లో హాఫ్ సెంచరీతో కేన్ విలియమ్సన్ కోహ్లీ, డుప్లెసిస్‌లను అధిగమించాడు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ 36 మ్యాచ్‌ల్లో 8 హాఫ్ సెంచరీలు చేయగా... డుప్లెసిస్ 40 మ్యాచ్‌ల్లో 7 హాఫ్ సెంచరీలు సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లు కూడా ఈ ముగ్గురే కావడం విశేషం.

అగ్రస్థానంలో డుప్లెసిస్

అగ్రస్థానంలో డుప్లెసిస్

ఈ జాబితాలో డుప్లెసిస్(1273) పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.... కేన్ విలియమ్సన్(1243) రెండో స్థానంలో.... విరాట్ కోహ్లీ(1126) పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం సొంతగడ్డపై జరుగుతున్న ఐదు టీ20ల సిరిస్‌ను కేన్ నాయకత్వంలోని కివీస్ 3-0తో చేజార్చుకుంది.

కివీస్ గడ్డపై టీ20 సిరిస్ నెగ్గిన తొలి భారత కెప్టెన్‌గా కోహ్లీ

కివీస్ గడ్డపై టీ20 సిరిస్ నెగ్గిన తొలి భారత కెప్టెన్‌గా కోహ్లీ

ఫలితంగా కివీస్ గడ్డపై టీ20 సిరిస్ నెగ్గిన తొలి భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. మూడో టీ20లో టీమిండియా విజయం సాధించడంతో ఐదు టీ20ల సిరిస్‌‌లో మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే సిరీస్‌ను 3-0తో టీమిండియా కైవసం చేసుకుంది. కివీస్ గడ్డపై టీమిండియాకు ఇదే తొలి టీ20 సిరిస్ కావడం విశేషం.

చివరి వరకు ఉత్కంఠ

చివరి వరకు ఉత్కంఠ

చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మూడో టీ20లో మ్యాచ్ ఫలితాన్ని సూపర్ ఓవర్ నిర్ణయించింది. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 17 పరుగులు చేయగా... అనంతరం భారత జట్టులో రోహిత్ శర్మ రెండు సిక్సులతో చెలరేగడంతో భారత్‌ 20 పరుగులు చేసి విజయం సాధించింది.

ఐదు మ్యాచ్‌ల్లో కివీస్ ఓటమి

ఐదు మ్యాచ్‌ల్లో కివీస్ ఓటమి

ఫలితంగా న్యూజిలాండ్ సూపర్ ఓవర్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదింట ఓడిపోయింది. ఈ ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు కివీస్ పేసర్ టిమ్ సౌథీతో సూపర్ ఓవర్ వేయించడం విశేషం. మరోవైపు టీమిండియా సూపర్ ఓవర్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

Story first published: Wednesday, January 29, 2020, 18:35 [IST]
Other articles published on Jan 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X