న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs South Africa: 'రబాడ నన్ను స్లెడ్జింగ్‌ చేశాడు, ఏకాగ్రతను దెబ్బతీశాడు'

India vs South Africa 2019 : Rabada Tried To Sledge But I Was In My Zone : Pujara || Oneindia
Kagiso Rabada tried to sledge but I was in my zone: Cheteshwar Pujara

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబాడ తనను స్లెడ్జింగ్‌ చేశాడని టీమిండియా ఆటగాడు ఛటేశ్వర్ పుజారా అన్నాడు. తన ఏకాగ్రతను దెబ్బతీసేందుకు రబాడ ప్రయత్నించాడని అయితే, తాను బ్యాటింగ్‌పై దృష్టి సారించడంతో వాటిని పట్టించుకోలేదని పుజారా చెప్పుకొచ్చాడు.

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పుజారా డకౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని హాఫ్ సెంచరీ అనంతరం రబాడ బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరాడు.

మ్యాచ్ అనంతరం పుజారా మాట్లాడుతూ "అతను ఏమన్నాడో నాకు గుర్తు లేదు. బ్యాట్స్‌మెన్‌ను చికాకు పెట్టేందుకు అతను (రబాడ) ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. అతడు నా ఏకాగ్రతకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తాడని ఒక బ్యాట్స్‌మన్‌గా నాకు తెలుసు. ఏ బౌలరైనా అంతే" అని అన్నాడు.

1
46114

"దీంతో అతడి మాటలను వినిపించుకోను. ఏకాగ్రతతో ఆడుతున్నప్పుడు, బ్యాటింగ్‌పై దృష్టి సారించినప్పుడు అలాంటి వాటిని పట్టించుకోను. అందుకే అతడు ఏమన్నాడో నాకు అర్థం కాలేదు" అని పుజారా పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది.

నాలుగో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం

నాలుగో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం

ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(63), అజ్యింకె రహానే(18) పరుగులతో ఉన్నారు. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ అనంతరం కొద్దిసేపటికే వెలుతురు లేకపోవడంతో అంపైర్లు తొలిరోజు ఆటను 85.1 ఓవర్ల వద్ద నిలిపివేశారు. ఇదిలా ఉంటే టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఇది 23వ హాఫ్ సెంచరీ. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 147 బంతుల్లో 75 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

మూడు వికెట్లు తీసిన రబాడ

టీమిండియా కోల్పోయిన మూడు వికెట్లు దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడకే దక్కడం విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే రోహిత్ శర్మ ఔటయ్యాడు. దక్షిణాఫ్రికా పేసర్ రబాడ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ చివరి బంతిని రోహిత్ శర్మ(14) డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

పుజారా హాఫ్ సెంచరీ

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి మయాంక్ అగర్వాల్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని ముందుకు నడిపించాడు. హాఫ్ సెంచరీ అనంతరం జట్టు స్కోరు 163 పరుగుల వద్ద పూజారా(58) రెండో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

మయాంక్ అగర్వాల్ సెంచరీ

పుజారా ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో కలిసి మయాంక్‌ అగర్వాల్‌ సమయోచితంగా ఆడుతూ సెంచరీ (108) సాధించాడు. తొలి టెస్టులో డబుల్‌ సెంచరీతో ఆకట్టుకున్న మయాంక్ అగర్వాల్ రెండో టెస్టులోనూ సఫారీ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఫిలాండర్ వేసిన ఇన్నింగ్స్ 57వ ఓవర్ మూడో బంతిని ఫోర్‌గా మలిచి సెంచరీ నమోదు చేశాడు.

Story first published: Friday, October 11, 2019, 8:21 [IST]
Other articles published on Oct 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X