Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘నీ కోసం ప్రైవేట్ జెట్ పంపిస్తా': ఆటగాడికి బంపరాఫర్!

ఐపీఎల్‌లో ఫ్రాంచైజీ యజమానులు ఆటగాళ్ల కోసం ఎంతటి ఖర్చుకైనా వెనుకాడరనే సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ తన ఐపీఎల్ అనుభవాల గురించి మాట్లాడుతూ.. ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని పంచుకున్నాడు. బీబీసీ 'స్ట్రాటజిక్ టైమౌట్' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన వుడ్.. తను అనారోగ్యంతో ఉన్న సమయంలో ఓ ఐపీఎల్ టీమ్ యజమాని తనను మ్యాచ్ ఆడించడం కోసం ఏకంగా ప్రైవేట్ విమానాన్ని పంపిస్తానని ఆఫర్ చేసినట్లు వెల్లడించాడు.

మార్క్ వుడ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఆయనకు తీవ్రమైన జ్వరం వచ్చింది. మరో మూడు రోజుల్లో తదుపరి మ్యాచ్ ఉండటంతో ఆయన కోలుకోవడానికి ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ప్రతి అరగంటకు ఒకసారి డాక్టర్లు వచ్చి వుడ్ ఆరోగ్యాన్ని పరీక్షించేవారట. ఆ సమయంలో జట్టు యజమాని స్వయంగా ఫోన్ చేసి.. "ఎలా ఉంది? మ్యాచ్‌కి రెడీనా?" అని అడిగేవారని వుడ్ గుర్తు చేసుకున్నారు. తాను కనీసం మంచం మీద నుంచి దిగలేకపోతున్నానని.. ఏమీ తినడం లేదని చెప్పినా.. ఆ యజమాని మాత్రం పట్టువదలకుండా మరో డాక్టర్‌ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారట.

Mark Wood Reveals IPL Owner Offered Private Jet to Play Match Despite High Fever Full Details

అయినా తగ్గని జ్వరంతో మార్క్ వుడ్ ఇబ్బంది పడుతుండగా.. మరుసటి రోజు ఆ యజమాని మరో అడుగు ముందుకు వేసి సంచలన ఆఫర్ ఇచ్చారు. "నువ్వు ఎలాగైనా వచ్చి మ్యాచ్ ఆడాలి. నీ కోసం నేను ప్రత్యేకంగా ఓ ప్రైవేట్ ప్లేన్ పంపిస్తాను. అందులో వచ్చి మ్యాచ్ ఆడు.. ఆట ముగిసిన వెంటనే అదే ప్రైవేట్ ప్లేన్‌లో నిన్ను మళ్ళీ నీ బెడ్ దగ్గరికి చేరుస్తాను" అని ఆ యజమాని అన్నట్లు మార్క్ వుడ్ వివరించాడు. ఈ ఆఫర్ విన్నప్పుడు తాను ఆశ్చర్యపోయానని, దీనిపై తన తండ్రి సలహా కూడా తీసుకున్నానని, కానీ చివరకు తన ఆరోగ్యం దృష్ట్యా ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించానని వుడ్ తెలిపాడు.

మార్క్ వుడ్ తన కెరీర్‌లో ఇప్పటివరకు రెండు ఐపీఎల్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఓ మ్యాచ్ ఆడిన ఆయన, 2023లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరపున బరిలోకి దిగి 4 మ్యాచ్‌లలో 11 వికెట్లు పడగొట్టాడు. అయితే తనను అంతగా బ్రతిమాలిన ఆ ఓనర్ ఎవరనేది మాత్రం మార్క్ వుడ్ బయటపెట్టలేదు. ఈ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Story first published: Monday, May 4, 2026, 10:54 [IST]
Other articles published on May 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+