Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒరేయ్ ఆజామూ కప్పెఎత్తరోయ్!

PSL 2026: బాబర్ ఆజం సారథ్యంలోని పెషావర్ జల్మీ జట్టు పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్టును ఓడించి పెషావర్ జల్మీ రెండోసారి టైటిల్‌ను ముద్దాడింది. గెలుపు అనంతరం పెషావర్ ప్లేయర్లు మైదానంలో భారీగా సంబరాలు చేసుకున్నారు. జట్టును విజేతగా నిలిపిన తమ కెప్టెన్ బాబర్ ఆజంను ఆటగాళ్లు భుజాలపై ఎత్తుకుని మైదానమంతా పరుగులు తీశారు. కెప్టెన్‌గా బాబర్ ఆజంకు ఇది మొదటి పీఎస్ఎల్ టైటిల్ కావడం విశేషం.

5 వికెట్ల తేడాతో విజయం
ఈ లో-స్కోరింగ్ ఫైనల్ మ్యాచ్‌లో పెషావర్ జల్మీ 5 వికెట్ల తేడాతో గెలుపు తీరాలకు చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ 18 ఓవర్లలోనే 129 పరుగులకు ఆలౌట్ అయింది. సామ్ అయూబ్ 54 పరుగులతో రాణించగా.. పెషావర్ బౌలర్ ఆరోన్ హార్డీ 4 వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి నడ్డి విరిచాడు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పెషావర్ ఒక దశలో 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఆరోన్ హార్డీ (56), అబ్దుల్ సమద్ (48) అద్భుత భాగస్వామ్యంతో జట్టును 16వ ఓవర్లోనే విజయ తీరాలకు చేర్చారు.

PSL 2026 Babar Azam Leads Peshawar Zalmi to Title Glory in Thrilling Final Win Full Details

ఫైనల్ మ్యాచ్‌లో బాబర్ ఆజం గోల్డెన్ డక్ (తొలి బంతికే ఔట్)గా వెనుదిరిగినప్పటికీ.. ఈ టోర్నీ మొత్తంలో అతనే అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచాడు. బాబర్ ఆజం కేవలం 11 మ్యాచ్‌ల్లోనే 73.50 సగటుతో 588 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక పరుగులు చేసినందుకు గాను బాబర్ ఆజంకు 'బెస్ట్ బ్యాటర్' అవార్డుతో పాటు 35 లక్షల పాకిస్థానీ రూపాయల ప్రైజ్ మనీ దక్కింది.

జట్టు విజయం పట్ల బాబర్ ఆజం ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. మైదానంలో ఆటగాళ్లు తనను భుజాలపై మోస్తున్నప్పుడు అతని ముఖంలో విజయోత్సాహం స్పష్టంగా కనిపించింది. "కెప్టెన్‌గా ఈ ట్రోఫీని గెలవడం నాకెంతో ప్రత్యేకం. మా జట్టు సభ్యుల కృషి వల్లే ఇది సాధ్యమైంది" అని బాబర్ పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెషావర్ జల్మీ సంబరాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Story first published: Monday, May 4, 2026, 9:46 [IST]
Other articles published on May 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+