శుభ్‌మన్ గిల్ పెళ్లి వార్తలపై క్లారిటీ వచ్చేసింది! (వీడియో)
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే 3(ఆదివారం) పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. టాస్ సమయంలో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓ అనూహ్యమైన ప్రశ్నను ఎదుర్కోవాల్సి వచ్చింది. టాస్ గెలిచిన గిల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నట్లు ప్రకటించగా.. అయితే కామెంటేటర్ డ్యానీ మోరిసన్ హఠాత్తుగా గిల్ వ్యక్తిగత జీవితంపై ప్రశ్న వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
డ్యానీ మోరిసన్ నవ్వుతూ.. "పెళ్లి గురించి ఏమైనా వార్తలు ఉన్నాయా? మేము తెలుసుకోవాల్సిన విశేషం ఏమైనా ఉందా?" అని అడిగారు. ఈ అకస్మాత్తు ప్రశ్నకు గిల్ ఒక్కసారిగా షాకయ్యాడు. కాస్త అసహనానికి, ఇబ్బందికి గురైనట్లు కనిపించిన గిల్.. వెంటనే తేరుకుని "లేదు.. లేదు.. ఏమీ లేదు" అని క్లుప్తంగా సమాధానం ఇచ్చారు. మోరిసన్ వెంటనే విషయాన్ని మార్చినప్పటికీ.. ఈ సెకన్ల వ్యవధిలో జరిగిన సంభాషణ కెమెరాలో బంధీ అయి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

నిజానికి శుభ్‌మన్ గిల్‌కు ఇలాంటి ప్రశ్న ఎదురవ్వడం ఇది మొదటిసారి కాదు. గత ఐపీఎల్ సీజన్‌లో కూడా డ్యానీ మోరిసన్ టాస్ సమయంలోనే గిల్‌ను ఇదే తరహాలో ప్రశ్నించి ఇబ్బంది పెట్టారు. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్ల గురించి గిల్ గతంలోనే స్పష్టత ఇచ్చారు. తాను గత మూడేళ్లుగా సింగిల్‌గానే ఉంటున్నానని, నిరంతర ప్రయాణాలు, బిజీ క్రికెట్ షెడ్యూల్ కారణంగా ప్రస్తుతానికి ప్రేమ లేదా పెళ్లి వంటి వాటికి సమయం కేటాయించడం సాధ్యం కాదని గిల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
అయితే లైవ్ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్ల వ్యక్తిగత విషయాల గురించి ఇలా బహిరంగంగా ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం అనే చర్చ ఇప్పుడు మొదలైంది. సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఇది కేవలం వినోదం కోసమే అని అభిప్రాయపడుతుంటే.. మరికొందరు మాత్రం ఆటగాళ్ల గోప్యతను గౌరవించాలని, మైదానంలో ఇలాంటి అసౌకర్యకరమైన ప్రశ్నలు అడగకూడదని విమర్శిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications