న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Catch of the Season: బౌండరీ లైన్ వద్ద జోఫ్రా క్యాచ్ పట్టాడిలా!(వీడియో)

Jofra Archer grabs a stunner in BBL 2018-19, fans call it catch of the season

హైదరాబాద్: బిగ్‌బాష్‌ లీగ్‌లో వెస్టిండిస్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్‌ బౌండరీ లైన్‌ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. వివరాల్లోకి వెళితే టోర్నీలో భాగంగా మంగళవారం బ్రిస్బెన్‌హీట్‌-హోబర్ట్‌ హరికేన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ సూపర్ మ్యాన్ తరహా క్యాచ్ అందుకున్నాడు.

ఫల్క్‌నర్‌ వేసిన మూడో ఓవర్‌ ఐదో బంతికి

ఫల్క్‌నర్‌ వేసిన మూడో ఓవర్‌ ఐదో బంతికి

బ్రిస్బెన్‌ హీట్‌ ఇన్నింగ్స్‌లో జేమ్స్‌ ఫల్క్‌నర్‌ వేసిన మూడో ఓవర్‌ ఐదో బంతిని ఓపెనర్‌ మ్యాక్స్‌ బ్రియాంట్‌ లాంగాన్‌లో భారీ షాట్‌ ఆడాడు. దీంతో అంతా సిక్స్‌గా భావించారు. అయితే, ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న జోఫ్రా అర్చర్ పరిగెత్తుకుంటూ వెళ్లి బౌండరీ లైన్‌ వద్ద ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు.

ఆశ్చర్యానికి లోనైన అభిమానులు

ఆశ్చర్యానికి లోనైన అభిమానులు

ఆ సమయంలో సమన్వయం కోల్పోతున్ననట్లు గ్రహించిన ఆర్చర్‌ బంతిని వెంటనే గాల్లోకి విసిరేసి బౌండరీ లైన్ దాటొచ్చి మరీ అందుకున్నాడు. రెప్పపాటులో జరిగిన ఈ ఫీట్‌తో మైదానంలో ఆటగాళ్లతో పాటు మ్యాచ్‌ని వీక్షిస్తోన్న అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ క్యాచ్‌తో బ్రియాంట్‌ (7) నిరాశగా పెవిలియన్‌ చేరాడు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మ్యాచ్‌లో హోబర్ట్‌ హరికేన్స్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బ్రిస్బెన్‌ హీట్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఆ తర్వాత హరికేన్స్‌ 14.2 ఓవర్లలోనే ఒక వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

Story first published: Wednesday, January 30, 2019, 13:35 [IST]
Other articles published on Jan 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X