న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంతితో మ్యాజిక్‌ చేసిన జో రూట్.. దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ ఘన విజయం!!

Joe Root Takes Four as England won, Keshav Maharaj fifty in vain as ENG take series lead

పోర్ట్ ఎలిజిబెత్: నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. కెప్టెన్ జో రూట్‌ (4/87) బంతితో మ్యాజిక్‌ చేయడంతో.. ఇంగ్లీష్ జట్టు ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. విదేశాల్లో ఇది ఇంగ్లండ్‌కు 150వ టెస్ట్ విజయం కావడం విశేషం.

మూడో వన్డేలో స్టార్క్‌ డకౌట్.. ట్రోల్‌ చేసిన భార్య అలీసా హేలీ!మూడో వన్డేలో స్టార్క్‌ డకౌట్.. ట్రోల్‌ చేసిన భార్య అలీసా హేలీ!

102/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఐదవ రోజు సోమవారం ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 88.5 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌట్ అయింది. రూట్‌కు తోడు మార్క్ వుడ్ మూడు వికెట్లు తీయడంతో ప్రొటీస్ కోలుకోలేకపోయింది. ఫిలాండర్ (13), రబడ (16), నొర్జే (5), మహారాజ్ (71) చివరి రోజు పెవిలియన్ చేరారు. కెప్టెన్ డుప్లెసిస్ (36), మహారాజ్ (71) మినహా ఎవరూ రాణించలేకపోయారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు నష్టపోయి 499 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. బెన్‌ స్టోక్స్‌ (120; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఒలీ పోప్‌ (135 నాటౌట్‌; 18 ఫోర్లు, సిక్స్‌) సెంచరీలతో కదం తొక్కారు. మహారాజ్ 5 వికెట్లు తీసాడు. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలు 209 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఎల్గర్ (35), డికాక్ (63) పర్వాలేదనిపించారు. బెస్ 5 వికెట్లు కూల్చాడు.

అయితే ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ సఫారీలను ఫాలో ఆన్‌గా రెండో ఇన్నింగ్స్‌ ఆడించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ సౌతాఫ్రికా ఆధిక్యాన్ని సాధించలేకపోయింది. 237 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెంచరీ చేసిన ఒలీ పోప్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

దక్షిణాఫ్రికా పేసర్‌ రబడపై ఒక టెస్టు మ్యాచ్‌ నిషేధం విధించారు. తొలిరోజు ఆటలో జో రూట్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన రబడ.. రూట్‌ను రెచ్చగొట్టే విధంగా అతి సంబరాలు చేసుకున్నాడు. ఇలా చేయడం ఐసీసీ ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. రబడకు ఈ రెండేళ్లలో ఇది నాలుగో డీ మెరిట్‌ కావడంతో.. ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ టెస్టు నిషేధం పడింది.

Story first published: Monday, January 20, 2020, 17:17 [IST]
Other articles published on Jan 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X