న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మొతెరా పిచ్ టెస్ట్ క్రికెట్‌కు పనికొచ్చేదా? లేదా? అనేది ఐసీసీ డిసైడ్ చేస్తుంది: జో రూట్

Joe Root says Its for ICC to decide whether Motera pitch is fit for purpose, not players

అహ్మదాబాద్: మొతెరా ఎలాంటి పిచ్ అనేది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిర్ణయిస్తుందని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అన్నాడు. నరేంద్ర మోదీ మైదానం వేదికగా గురువారం ముగిసిన డే/నైట్ టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పింక్ టెస్ట్.. స్పిన్ ధాటికి రెండు రోజుల్లోనే ముగిసింది. అయితే మొతెరా పిచ్ టెస్ట్ క్రికెట్‌కు పనికిరాదని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్, భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ విమర్శించారు. ఈ విమర్శల నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన జో రూట్ అది ఐసీసీ తేలుస్తుందన్నాడు. తమవరకైతే చాలెంజింగ్ వికెట్‌గానే భావిస్తున్నామన్నాడు.

చాలెంజింగ్ వికెట్..

చాలెంజింగ్ వికెట్..

'మొతెరా ఎలాంటి పిచ్ అనేది ఐసీసీ నిర్ణయిస్తుంది. మా వరకైతే చాలెంజింగ్ వికెట్‌గానే భావిస్తున్నాం. దీనిపై ఆడటం చాలా కష్టం. మా అవకాశాలను వినియోగించుకోలేకపోయాం. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 71/2తో ఉండి తక్కువ స్కోరుకు ఆలౌట్ అయ్యాం. ఈ విషయంలో చాలా నిరాశగా ఉన్నాం. కనీసం 200 స్కోర్ చేసినా మ్యాచ్ ఫలితం భిన్నంగా ఉండేది. అక్షర్ పటేల్‌కు పిచ్ చాలా సహకరించింది.

పింక్ బాల్ ఎఫెక్ట్..

పింక్ బాల్ ఎఫెక్ట్..

పింక్ బాల్ చాలా ప్రభావం చూపింది. హార్డ్‌నెస్ కోసం ప్లాస్టిక్ వాడటం వల్ల.. రెడ్ ఎస్‌జీ బాల్‌తో పోలిస్తే చాలా విభిన్నంగా స్పందించింది. ఏదేమైనా మ్యాచ్‌లో మేం అనుకున్న స్థాయిలో ఆడలేకపోయాం. టీమిండియా సైతం అత్యుత్తమంగా బంతులు విసిరింది. వికెట్‌పై రెండు జట్లూ ఇబ్బంది పడ్డాయి. గత మ్యాచ్‌ ఓటమి ఒత్తిడిని మేమిక్కడికి తీసుకురాలేదు. మేం వికెట్లు తీయగలమని అనిపించింది. ఇక నేను ఐదు వికెట్లు తీశానంటే అది పిచ్‌ వల్లే. వందో మ్యాచ్‌ ఆడిన ఇషాంత్‌కు అభినందనలు' అని రూట్‌ తెలిపాడు.

అన్ ఫిట్ అయితే..

అన్ ఫిట్ అయితే..

ఇక ఐసీసీ నిబంధనల ప్రకారం పిచ్ అటు పూర్తిగా బ్యాటింగ్‌కు ఇటు బౌలింగ్‌కు అనుకూలంగా ఉండకూడదు. రెండింటి మధ్య సమ పోరు ఉండాలి. అలా కాకుండా వికెట్ పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించినా.. లేదా బౌలింగ్‌కు అనుకూలించినా పూర్ పిచ్‌గా పరగణిస్తారు. అప్పుడు హోమ్ టీమ్‌కు మూడు పాయింట్స్ కోత విధిస్తారు. ఇక మొతెరా పిచ్‌ అన్ ఫిట్ అని తెలితే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భారత్ మూడు పాయింట్లు కోల్పోనుంది. ప్రస్తుతం 490 పాయింట్లతో కోహ్లీసేన టాప్‌లో ఉంది.

ఇంగ్లండ్ ఔట్..

ఇంగ్లండ్ ఔట్..

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటికే 70% విజయాల రేటుతో ఫైనల్‌ చేరుకున్న న్యూజిలాండ్‌ను అధిగమించింది. ప్రస్తుతం 71% విజయాల రేటు, 490 పాయింట్లతో నంబర్‌వన్‌గా అవతరించింది. తాజా అపజయంతో ఇంగ్లాండ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అర్హత రేసులోంచి నిష్క్రమించింది.

ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించే అవకాశాలు రెండు జట్లకే ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టును గెలిచినా డ్రా చేసుకున్నా భారత్‌ 2-1 లేదా 3-1తో ఫైనల్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఇంగ్లాండ్‌ గెలిస్తే 2-2 సిరీస్‌ సమం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాను అదృష్టం వరిస్తుంది.

Story first published: Friday, February 26, 2021, 8:30 [IST]
Other articles published on Feb 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X