న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టోక్స్ తొలి బంతి నుంచే మొదలెట్టాడు.. నన్ను రెచ్చగొట్టేందుకు ఎంతో ప్రయత్నించాడు: బ్లాక్​వుడ్

Jermaine Blackwood says from first ball, Ben Stokes tried to distract him

మాంచెస్టర్​: కరోనా వైరస్ కారణంగా దాదాపు నాలుగు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్ నిలిచిపోగా.. వెస్టిండీస్​-ఇంగ్లండ్ సిరీస్​తో పునఃప్రారంభమైంది. తొలి టెస్టులో విండీస్ సమిష్టి ప్రదర్శనతో ఇంగ్లండ్​ ఖంగుతినింది. రెండో ఇన్నింగ్స్​లో వెస్టిండీస్ బ్యాట్స్​మన్ జెర్నేన్ బ్లాక్‌వుడ్‌ (95; 12 ఫోర్లు) అదరగొట్టాడు. ఆతిథ్య జట్టుపై విండీస్ నాలుగు వికెట్ల తేడాతో గెలువడంలో అతడు ప్రధానపాత్ర పోషించాడు. అయితే తాను రెండో ఇన్నింగ్స్​ కోసం క్రీజులో అడుగుపెట్టాక.. తొలి బంతి నుంచే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తనను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడని బ్లాక్‌వుడ్‌​ చెప్పాడు.

తన ఫేవ‌రెట్ బ్యాటింగ్ పార్ట్‌న‌ర్ ఎవరో చెప్పిన పంత్!!తన ఫేవ‌రెట్ బ్యాటింగ్ పార్ట్‌న‌ర్ ఎవరో చెప్పిన పంత్!!

స్టోక్స్ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు:

స్టోక్స్ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు:

బుధవారం ఓ ఇంటర్వ్యూలో జెర్నేన్ బ్లాక్‌వుడ్ మాట్లాడుతూ... 'ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండో ఇన్నింగ్స్ మొదటి బంతి నుంచే నన్ను ఏదో ఒకటి అనడం ప్రారంభించాడు. నేను కోపంతో చెత్త షాట్ ఆడేలా చేయాలని అతడు తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే నేను ఏ దశలోనూ సహనం కోల్పోలేదు. అదే సమయంలో చిరాకు పడలేదు. నేను క్రీజులో ఉంటే వారు ఒత్తిడిలో ఉంటారు. అయితే స్టోక్స్ ఏమన్నాడో నాకు స్పష్టంగా వినపడలేదు. క్రికెట్​లో అలానే జరుగుతుంది. మాట్లాడుతుంటే కాస్త వినిపిస్తున్నా.. ఒక్కోసారి స్పష్టంగా అర్థం కాదు' అని చెప్పాడు.

బ్లాక్‌వుడ్‌ సూపర్ ఇన్నింగ్స్‌:

బ్లాక్‌వుడ్‌ సూపర్ ఇన్నింగ్స్‌:

200 పరుగుల లక్ష్య ఛేదనలో 27 పరుగులకే విండీస్ మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బ్రాత్‌వైట్‌ (4), హోప్‌ (9), బ్రూక్స్‌ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఈ దశలో చేజ్‌ (37)తో కలిసి బ్లాక్‌వుడ్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇంగ్లండ్‌ పేసర్లు బౌన్సర్లతో పరీక్ష పెడుతున్నా.. అకుంఠిత దీక్షతో క్రీజులో నిలబడ్డాడు. చేజ్‌ పెవిలియన్ చేరిన అనంతరం డౌరిచ్ అండతో జట్టును విజయానికి చేరువచేశాడు. అయితే శతకానికి ఐదు పరుగుల దూరంలో ఔటైయ్యాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మాంచెస్టర్ వేదికగా రెండో టెస్టు గురువారం ప్రారంభం కానుంది.

కెప్టెన్‌‌గా ‌స్టోక్స్ విఫలం:

కెప్టెన్‌‌గా ‌స్టోక్స్ విఫలం:

సౌథాంప్టన్ టెస్టులో జో రూట్‌ స్థానంలో కెప్టెన్‌గా వ్యవహరించిన బెన్ ‌స్టోక్స్.. పేలవ నిర్ణయాలతో ఇంగ్లండ్ ఓటమికి ప్రత్యక్షంగా కారణమయ్యాడు. టాస్ నుంచి తుది జట్టు ఎంపిక వరకూ అతని నిర్ణయాలపై విమర్శలు వచ్చాయి. టెస్టు ఆరంభానికి ముందు వర్షం పడే సూచనలు కనిపించినా.. టాస్ గెలిచిన ‌స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో సీనియర్ ఫాస్ట్ బౌలర్ బ్రాడ్‌‌పై వేటు వేయడం, అలానే ఫీల్డింగ్ కూర్పులోనూ తేలిపోయాడు. మొత్తంగా కెరీర్‌లో తొలిసారి కెప్టెన్‌‌గా వ్యవహరించిన ‌స్టోక్స్ ఘోరంగా ఫెయిలయ్యాడు.

రూట్ వచ్చేశాడు:

రూట్ వచ్చేశాడు:

తొలి టెస్టులో రెగ్యులర్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ లేని లోటు జట్టులో కనిపించింది. తన భార్య రెండో సంతానానికి జన్మనివ్వడంతో తొలి టెస్టుకు దూరమైన రూట్..​ గురువారం నుంచి జరిగే రెండో మ్యాచ్​కు కోసం సిద్ధమ్యాడు. రూట్​ రాకతో ఇంగ్లండ్ మళ్లీ ఫామ్​లోకి రావాలని పట్టుదలగా ఉంది. రూట్ జట్టుతో కలవనున్న నేపథ్యంలో ఇంగ్లండ్ బలం రెట్టింపవ్వనుంది. కెప్టెన్, బ్యాట్స్‌మన్‌గా రూట్ తన మార్క్ చూపెట్టనున్నాడు.

Story first published: Wednesday, July 15, 2020, 20:11 [IST]
Other articles published on Jul 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X