న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రా ఆడాలి.. ఇంట్లో కూర్చోకూడదు: పనిభారంపై జయవర్దనే

IPL 2019 : Jasprit Bumrah Must Play And Not Sit At Home Says Mahela Jayawardene | Oneindia Telugu
 Jasprit Bumrah must play and not sit at home: Mumbai Indians coach Mahela Jayawardene on IPL workload debate

హైదరాబాద్: మే30 నుంచి వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్‌లో ఆటగాళ్లు పనిభారాన్ని కూడా సమీక్షించుకోవాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న జస్ప్రీత్ బుమ్రాను కొన్ని మ్యాచ్‌లకు పక్కనబెడతారనే వార్తలపై ఆ జట్టు హెడ్ కోచ్ మహిళా జయవర్దనే స్పందించాడు.

కెప్టెన్సీలో ధోనితో కోహ్లీని పోల్చద్దు: గౌతమ్ గంభీర్కెప్టెన్సీలో ధోనితో కోహ్లీని పోల్చద్దు: గౌతమ్ గంభీర్

జయవర్దనే మాట్లాడుతూ

జయవర్దనే మాట్లాడుతూ

తాజాగా ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో జయవర్దనే మాట్లాడుతూ "పనిభారం గురించి ఆలోచించాల్సిందే, కానీ మంచి పోటీగల క్రికెట్‌ను ఆడటం కూడా ముఖ్యమే. ఇప్పటికే భారత్‌ ఆటగాళ్ల పనిభారాన్ని తగ్గించాడానికి బీసీసీఐ వారికి కావాల్సిన విశ్రాంతినిచ్చింది. గొప్ప ఆటగాళ్లు ఎప్పుడు ఆడుతూనే ఉండాలనేది నా అభిప్రాయం" అని అన్నాడు.

ఆటగాళ్ల పనిభారం విషయంలో

ఆటగాళ్ల పనిభారం విషయంలో

"వారు ఇంట్లో కూర్చోవద్దు. ఆడుతూనే ఉండాలి. ఆటగాళ్ల పనిభారం విషయంలో మేం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం. బుమ్రా యాక్షన్‌ వల్ల గాయం అయ్యే అవకాశం ఉందనడం సరికాదు. మారథాన్‌ రన్నర్స్‌ టెక్నిక్‌ వీడియోలు చూసినప్పుడు కూడా మనకు వారికేదో గాయం అయినట్లు అనిపిస్తోంది. కానీ, వారంతా అద్భుతమైన రికార్డులు సృష్టిస్తారు" అని జయవర్దనే అన్నాడు.

బుమ్రా మంచి అటాకింగ్‌ బౌలర్

బుమ్రా మంచి అటాకింగ్‌ బౌలర్

"బుమ్రా కూడా అలానే. అతను మంచి అటాకింగ్‌ బౌలర్. డెత్‌ ఓవర్లలో అతని బౌలింగ్‌ ముఖ్యం. అతను కచ్చితంగా గేమ్‌ చేంజరే" అని మహిళా జయవర్దనే చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ ముగిసిన రెండు వారాలకే అంటే మే30న ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, March 19, 2019, 12:32 [IST]
Other articles published on Mar 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X