న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నా దృష్టి ఎప్పుడూ క్రికెట్‌పైనే.. కేవలం టెస్టు క్రికెట్‌కు‌ మాత్రమే పరిమితం కాను'

Jason Holder Says He Doesnt Want To Stick To Just Test Cricket

జమైకా: కేవలం టెస్ట్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కావడం ఇష్టం లేదని, మూడు ఫార్మాట్లలోనూ ప్రభావం చూపాలని కోరుకుంటున్నానని వెస్టిండీస్ ఆల్‌రౌండర్‌ జాసన్‌ హోల్టర్‌ చెప్పాడు. తన దృష్టి ఎప్పుడూ విండీస్ క్రికెట్‌పైనే ఉంటుందని పేర్కొన్నాడు. హోల్టర్ గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌‌లో వెస్టిండీస్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

భారతే మ్యాచ్ ఫిక్సింగ్‌లకు అడ్డా.. పాక్ మాజీ పేసర్ సంచలన ఆరోపణలు!!భారతే మ్యాచ్ ఫిక్సింగ్‌లకు అడ్డా.. పాక్ మాజీ పేసర్ సంచలన ఆరోపణలు!!

ఇటీవల మరో ఆల్‌రౌండర్‌ కీరోన్‌ పొలార్డ్‌ను పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఎంపిక చేసి.. హోల్డర్‌ను టెస్టు సారథిగా మాత్రమే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. దాంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన స్థానం ఉండదేమోనని ఆందోళనలో ఉన్న హోల్డర్‌.. తనను అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు పరిగణలోకి తీసుకోవాలని బోర్డుకు విన్నవించాడు. గత కొన్ని ఏళ్లుగా విండీస్‌ తరపున అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ ఆడుతున్నానని, ఇకపై కూడా ఆడాలనే కోరుకుంటున్నానని హోల్టర్ పేర్కొన్నాడు.

'నేను టెస్ట్ జట్టుకు కెప్టెన్. కానీ నేను చాలా సంవత్సరాలుగా అన్ని ఫార్మాట్స్ ఆడుతున్నా. నా దృష్టి ఎప్పుడూ విండీస్‌ క్రికెట్‌పైనే ఉంటుంది. అది కేవలం టెస్టు క్రికెట్‌ మాత్రమే కాదు. నేను పంజరంలో పావురంలా ఏ ఒక్క దానికో పరిమితం కాదల్చుకోలేదు. విండీస్‌ క్రికెట్‌ అనేది వేర్వేరు సందర్భాల్లో పలు రకాలుగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఈ పజిల్‌లో ఆటగాళ్లంతా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడమే మా కర్తవ్యం' అని హోల్టర్ అన్నాడు.

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ నెగ్గిన వెస్టిండీస్ జ‌ట్టు కంటే ప్ర‌స్తుత జట్టు ఎంతో మెరుగ్గా ఉంద‌ని ఆల్‌రౌండ‌ర్ డ్వేన్ బ్రావో అన్నాడు. 2016 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను వెస్టిండీస్ జ‌ట్టు సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆ జ‌ట్టులో స‌భ్యుడైన బ్రావో కొంత విరామం త‌ర్వాత తిగిగి విండీస్ జాతీయ జ‌ట్టుకు ఎంపిక‌య్యాడు. 'విండీస్ జ‌ట్టు చివ‌రిసారిగా శ్రీ‌లంక‌తో ఆడిన సిరీస్‌లో నేను కూడా ఆడాను. ఆ స‌మ‌యంలో కోచ్ ఫిల్ సిమ్మ‌న్స్ ఓ స‌మావేశం ఏర్పాటు చేశాడు. బ్యాటింగ్ ఆర్డ‌ర్ వివ‌రాలు చెప్తూ.. న‌న్ను తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సిందిగా కోరాడు. అందుకు నేను ఒప్పుకున్నా. ప్ర‌స్తుత వెస్టిండీస్ జ‌ట్టు 2016 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన జ‌ట్టు కంటే బ‌లంగా ఉంది. అందుకే నేను ప‌దో స్థానంలో బ్యాటింగ్‌కు దిగ‌డానికైనా సిద్ధ‌మే' అని బ్రావో తెలిపాడు.

Story first published: Thursday, May 7, 2020, 18:57 [IST]
Other articles published on May 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X