న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా లాజిక్ ప్రకారం కోల్‌కతా నేటి మ్యాచ్‌లో ఓడిపోతుందేమో: కోచ్ కల్లీస్

Jacques Kallis reveals one worrying factor for KKR this season

హైదరాబాద్: ఐపీఎల్ 11లో భాగంగా జరుగుతోన్న సమరంలో కోల్‌కతా జట్టుకు కెప్టెన్‌గా తొలిసారి దినేశ్ కార్తీక్ బాధ్యతలు అందుకున్నాడు. లీగ్ ఆరంభంలో కోల్‌కతా ఆడిన తొలి మ్యాచ్‌లో బెంగళూరుపై గెలిచి శుభారంభాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత జరిగిన మ్యాచ్ లలో పరవాలేదనిపించుకుంటూ పరుగులు చేస్తూ వస్తుంది. అయితే లీగ్ ఇప్పటికే సగానికి పైగా ముగిసిపోతుండటంతో అన్ని జట్లలాగే ప్లేఆఫ్ బరిలోకి వెళ్లేందుకు భారీ సన్నాహాలు చేపట్టింది.

రాజస్థాన్ జట్టుతో తలపడడం రెండోసారి:

రాజస్థాన్ జట్టుతో తలపడడం రెండోసారి:

ఆఖరి మ్యాచ్ విజయంతో ముగించిన కోల్‌కతా జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. లీగ్‌లో రాజస్థాన్ జట్టుతో తలపడడం రెండోసారి. అయితే మొదటి సారి జరిగిన మ్యాచ్ లో కోల్‌కతానే గెలిచింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో సారి మంగళవారం తలపడేందుకు సిద్ధమైంది కోల్‌కతా జట్టు. అక్కడే వచ్చింది అసలు సమస్య. లీగ్ ఆరంభం నుంచి కోల్‌కతా జట్టు విజయం తర్వాత ఆడిన మ్యాచ్‌ను దాదాపు ఓడిపోతూనే ఉంది.

విజయం తర్వాత ఆడిన మ్యాచ్‌లో కూడా గెలవాలనే:

విజయం తర్వాత ఆడిన మ్యాచ్‌లో కూడా గెలవాలనే:

దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ అయిన కోల్‌కతా జట్టు ప్రధాన కోచ్ జాక్వెలిస్ మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 11లో మేము ఓడిన ప్రతిసారి అంతే వేగంతో విజయం దిశగా పయనిస్తున్నాం. కానీ, విజయం తర్వాత ఆడిన మ్యాచ్‌లో కూడా గెలవాలనే బలమైన ఆకాంక్షతో ఉన్నానని పేర్కొన్నాడు. ఐపీఎల్11లో కోల్‌కతా ఈ క్రమంలోనే 1, 4, 5, 8, 9, 12 మ్యాచ్‌లను గెలిచి 2, 3, 6, 7, 10, 11 మ్యాచ్‌లలో ఓడిపోయింది.

జట్టు భవిష్యత్ ఇంకా మా చేతుల్లోనే

జట్టు భవిష్యత్ ఇంకా మా చేతుల్లోనే

కోల్‌కతా జట్టు ప్లేఆఫ్ రేసు గురించి కోచ్ కలిస్ మాట్లాడుతూ ‘ఈ సీజన్‌లో జట్టు భవిష్యత్ ఇంకా మా చేతుల్లోనే ఉంది. టోర్నీలో మిగిలి ఉన్న రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవగలిగితే ప్లేఆఫ్ చేరుతాం. ఇందులో భాగంగా తొలుత రాజస్థాన్ రాయల్స్‌పై మెరుగైన ప్రదర్శన కనబర్చాలి. టోర్నీలో ఇప్పటి వరకు కోల్‌కతా ఆటతీరుపై మాలో ఎలాంటి ఆందోళన లేదు. ఈరోజు రెండు జట్లూ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి. పోరు ఉత్కంఠగా జరుగుతుంది' అని కలిస్ వెల్లడించాడు. టోర్నీలో గత మూడు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్ గెలిచి ప్లేఆఫ్ రేసులోకి దూసుకొచ్చింది.

రెండు మ్యాచ్‌లే నిర్ణయిస్తాయని

రెండు మ్యాచ్‌లే నిర్ణయిస్తాయని

సీజన్‌లో రాతని మిగిలిన రెండు మ్యాచ్‌లే నిర్ణయిస్తాయని ఆ జట్టు ప్రధాన కోచ్ జాక్వెస్ కలిస్ అభిప్రాయపడ్డాడు. టోర్నీలో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లాడిన కోల్‌కతా జట్టు ఆరింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. ప్లేఆఫ్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు తప్పక గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 8 గంటలకి రాజస్థాన్ రాయల్స్‌తో కోల్‌కతా జట్టు అమితుమీకి సిద్ధమైంది.

Story first published: Tuesday, May 15, 2018, 19:31 [IST]
Other articles published on May 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X