న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018: గురు శిష్యుల పోరాటం, టిక్కెట్లన్నీ అయిపోయాయ్...

Its Virat Kohli v/s MS Dhoni in Indian Premier League as RCB-CSK renew rivalry

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ అయినా ఇప్పటికీ ధోనీ చెప్పే సలహాల ప్రకారమే జట్టును నడిపిస్తాడు విరాట్ కోహ్లీ. ధోనీ ఉన్నాడంటే.. మ్యాచ్‌లో ప్రతి నిర్ణయం అతణ్ని సంప్రదించే తీసుకుంటాడు. అలాంటి గురువుకు ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌గా మ్యాచ్ ఆడబోతున్నాడు. దానికి వేదికగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దానికి వేదిక కానుంది.

కోహ్లీ × ధోనీ

కోహ్లీ × ధోనీ

టోర్నీలో భాగంగా ఈ రోజు వీరిద్దరూ నాయకత్వం వహిస్తోన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు - చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. టోర్నీలో భాగంగా జరుగుతోన్న కొన్ని మ్యాచ్‌లకు ప్రేక్షకాదరణ కరువైంది.

టిక్కెట్లు హాట్‌ కేకుల్లా

టిక్కెట్లు హాట్‌ కేకుల్లా

కోహ్లీ-ధోనీ తలపడే మ్యాచ్‌కి టిక్కెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం నలభై వేలు. మైదానం వద్ద ఆదివారం సుమారు 25వేల టిక్కెట్ల అమ్మకాలు చేపట్టారు. గంటల వ్యవధిలోనే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయినట్లు స్టేడియం నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు రూ.35వేలు, రూ.20వేల విలువ గల టిక్కెట్లు కూడా అందుబాటులో లేవని చెప్పేశారు.

మ్యాచ్‌ టిక్కెట్లన్నీ అయిపోయి

మ్యాచ్‌ టిక్కెట్లన్నీ అయిపోయి

‘దేశ వ్యాప్తంగా ధోనీ నాయకత్వం వహిస్తోన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎక్కడ మ్యాచ్‌లు ఆడిన వాటికి చాలా మంచి డిమాండ్‌ ఉంది. రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడుతోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు చెన్నైలో ఆడాల్సిన మ్యాచ్‌లు పుణె తరలి వెళ్లిపోయాయి. ఈ కారణాల వల్లే ఈ రోజు మ్యాచ్‌ టిక్కెట్లన్నీ అయిపోయి ఉంటాయి' అని స్టేడియం సిబ్బంది తెలిపారు.

చెన్నైపై బెంగళూరుకు మంచి రికార్డేమీ లేదు:

చెన్నైపై బెంగళూరుకు మంచి రికార్డేమీ లేదు:

దీంతో టిక్కెట్లు తీసుకుందామని స్టేడియం వద్దకు వచ్చిన అభిమానులకు నిరాశే ఎదురౌతోంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు మంచి రికార్డేమీ లేదు. ఈ టోర్నీలో చెన్నైదే పైచేయి. మరి సొంత మైదానంలో జరిగే ఈ రోజు మ్యాచ్‌లో కోహ్లీ సేన గెలుస్తుందో... లేక మళ్లీ పరాజయాన్ని వరిస్తుందో సాయంత్రం మ్యాచ్‌లో చూడాలి.

Story first published: Wednesday, April 25, 2018, 13:17 [IST]
Other articles published on Apr 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X