న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'వరల్డ్‌కప్ ట్రోఫీ నెగ్గేందుకు ఇంగ్లాండ్‌కు ఇదే బెస్ట్ ఛాన్స్'

 ‘Its the best opportunity for England to bag maiden World Cup title’ believes Michael Vaughan

హైదరాబాద్: వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో విశ్వవిజేతగా నిలిచేందుకు ఇంగ్లాండ్‌కు ఇదే సరైన సమయమని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డపై వరల్డ్‌కప్ జరగనుండటం... ఇంగ్లాండ్ జట్టులోని ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశమని వాన్ తెలిపాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే ఈ మెగా టోర్నీలో ఇంగ్లాండ్ కూడా టైటిల్ ఫేవరేట్ జట్టలో ఒకటిగా ఉంది. వరల్డ్‌కప్‌కు ముందు జరిగిన నాలుగు వన్డే సిరిస్‌ల్లో ఇంగ్లాండ్ మూడింట విజయ సాధించించింది. ఇక, వెస్టిండిస్‌తో జరిగిన వన్డే సిరిస్‌ను 2-2తో సమం చేసింది.

మూడు సార్లు ఫైనల్‌కు

మూడు సార్లు ఫైనల్‌కు

ఇప్పటివరకు జరిగిన వరల్డ్ కప్‌ల్లో మూడు సార్లు (1979, 1987, 1992)లో ఫైనల్‌కు చేరినప్పటికీ ఒక్కసారి కూడా వరల్డ్‌కప్ ట్రోఫీని నెగ్గలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మాట్లాడుతూ "ఇంగ్లాండ్‌కు ఇదొక గొప్ప అవకాశం. యువకుడిగా నాకు ఇప్పటికీ గుర్తే 1992 వరల్ల్ కప్‌ ఫైనల్ మ్యాచ్‌ని కాలేజీలో చూడటం" అని చెప్పాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్‌కు

ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్‌కు

2017లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు సెమీపైనల్ వరకు చేరుకుంది. అయితే, పాకిస్థాన్‌తో జరిగిన సెమీపైనల్లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ నుంచి ఇంగ్లాండ్ పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్‌ను తీసుకుని, ఈ వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు చేరితో స్మార్ట్ క్రికెట్ ఆడాలని వాన్ సూచించాడు.

ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఐదోసారి

ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఐదోసారి

ఇక, మెగా టోర్నీలో భాగంగా విరాట్‌ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా జూన్‌ 5న సౌతంప్టన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. డే మ్యాచ్‌లు అన్ని కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి.

లార్డ్స్‌లో వరల్డ్‌కప్ పైనల్ మ్యాచ్

లార్డ్స్‌లో వరల్డ్‌కప్ పైనల్ మ్యాచ్

డే/నైట్ మ్యాచ్‌లు మాత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ వరల్డ్‌కప్‌ను మాత్రం రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.

Story first published: Monday, July 27, 2020, 17:26 [IST]
Other articles published on Jul 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X