న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నీ కెప్టెన్సీలో ఆడటం మాకెంతో అదృష్టం: పంత్

It’s a privilege to play in the Virat Kohli’s era, says Rishabh Pant

హైదరాబాద్: ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుండే కోహ్లీని తెగ పొగిడేస్తున్నాడు టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్. ఒక్కో మెట్టు ఎక్కుతూ తనని తాను గొప్ప క్రికెటర్‌గా మలచుకున్న విరాట్ కోహ్లీ అన్నీ ఫార్మాట్లలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్, వెస్టిండీస్‌ల టెస్టుల్లో వ్యక్తిగతంగా మంచి స్కోరును సాధించాడు. కెప్టెన్‌గా యువ క్రికెటర్లకు అవకాశమిచ్చే విషయంలోనూ వెనుకాడడు.

 ధోనీకి ప్రత్యమ్నాయంగా పంత్ కీపింగ్ బాధ్యతలు

ధోనీకి ప్రత్యమ్నాయంగా పంత్ కీపింగ్ బాధ్యతలు

ఇలానే ప్రపంచ కప్ సమయానికి మెరుగుపడేలా రిషబ్ పంత్‌ను ఇప్పటి నుంచే జట్టులో తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసేందుకు అవకాశం రాకపోవడంతో.. రెండో ఇన్నింగ్స్‌లో చక్కగా ఆడి ఆకట్టుకున్నాడు. ఇలానే దూసుకుపోతే పంత్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని దక్కించుకుంటాడని సీనియర్లంతా ఆశిస్తున్నారు. ఇప్పటికే ధోనీకి ప్రత్యమ్నాయంగా పంత్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నాడు.

కోహ్లీ కెరీర్‌లో 10వేల పరుగులు పూర్తి

కోహ్లీ కెరీర్‌లో 10వేల పరుగులు పూర్తి

రెండో వన్డేలో మిగిలి ఉన్న 81పరుగులు పూర్తి చేయడంతో కోహ్లీ కెరీర్‌లో 10వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. అది కూడా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్‌లలో సాధించిన స్కోరును 205ఇన్నింగ్స్‌లలో ముగించేశాడు. ఈ సందర్భంగా కెప్టెన్‌ను యువ వికెట్ కీపర్ పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. అతని కెప్టెన్సీలో ఆడడం మా అదృష్టమని కొనియాడాడు. ఇంకా తమ లాంటి యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు.

మరిన్ని పరుగులు రావాలని ఆశిస్తున్నాం

'విరాట్ భాయ్ కంగ్రాచ్యులేషన్స్. చాలా తక్కువ వన్డే ఇన్నింగ్స్‌లలోనే 10వేల పరుగులు పూర్తి చేశావు. నువ్వు ఉన్న జట్టులో ఆడుతుండటం మా అదృష్టంగా భావిస్తున్నాం. నువ్వు మాకు ఇస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు. ఇంకా నీ నుంచి మరిన్ని పరుగులు రావాలని ఆశిస్తున్నాం.' అంటూ తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు అందజేశాడు పంత్.

 ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో

అయితే చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో షిమ్రోన్ హెట్‌మెయర్.. షై హోప్‌లు ధాటిగా ఆడి వెస్టిండీస్‌కు ఓటమి నుంచి తప్పించారు. టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకోవడంతో టీమిండియా 7వికెట్ల నష్టానికి 321పరుగులు చేసింది. ఆ తర్వాత చేధనకు దిగిన వెస్టిండీస్ కూడా 50ఓవర్లు ముగిసే సరికి అదే స్కోరును చేసింది.

Story first published: Thursday, October 25, 2018, 17:25 [IST]
Other articles published on Oct 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X