న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీని చూసి నేర్చుకోండి: చిరుతపులితో పోల్చిన అక్తర్

By Nageshwara Rao
It's Either Virat Kohli Or A Cheetah, Says Shoaib Akhtar

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చిరుతపులితో పోల్చాడు. ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఛేజింగ్‌లో సెంచరీ చేసిన కోహ్లీని అక్తర్ ప్రశంసల్లో ముంచెత్తాడు.

We don’t determine playing 11 from results: Virat Kohli

'ఛేజింగ్లో కోహ్లీ మరో సూపర్ ఇన్నింగ్ ఆడాడు. ఛేజింగ్ అంటే చాలు అతడు చిరుతపులిలా మారిపోతాడు. ఛేజింగ్‌లో అతడు కోహ్లీనా లేక చిరుతపులా అని డౌట్ వస్తుంది. యువ క్రికెటర్లు కోహ్లీని ఆదర్శంగా తీసుకుని ఎంతో నేర్చుకోవాలని' ట్వీట్ చేశాడు.



డర్బన్‌లో జరిగిన తొలి వన్డేలో ఓపెనర్లు త్వరగానే ఔటైనప్పటికీ, రహానే (79)తో కలిసి కోహ్లీ మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 33వ సెంచరీ. ఇందులో కోహ్లీ 20 సెంచరీలను ఛేజింగ్‌లోనే సాధించడం విశేషం.

20 సెంచరీల్లో 18 సెంచరీలు జట్టుకు విజయాన్ని అందించాయి. కోహ్లీ తన కెరీర్‌లో మొత్తంలో విదేశీ గడ్డపై 15 సెంచరీలు చేశాడు. కాగా, ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం సెంచూరియన్ వేదికాగ జరగనుంది. తొలి వన్డేలో విజయం సాధించడంతో ఆరు వన్డేల సిరిస్‌లో కోహ్లీసేన 1-0 ఆధిక్యంలో ఉంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, February 3, 2018, 13:20 [IST]
Other articles published on Feb 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X