న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నువ్వు ఏదైనా చెయ్యి.. స్మిత్ వికెట్ మాత్రం కావాలన్నాడు: ఇషాంత్

Ishant Sharma recalls how Virat Kohli reacted to his funny imitation of Steve Smith

ఢిల్లీ: భారత టెస్ట్ జట్టులోని సీనియర్ పేస్ బౌలర్లలో ఇషాంత్ శర్మ ఒకడు. ఇషాంత్ కొంతకాలంగా పేస్ అటాక్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. జట్టుకు ఎన్నో మంచి ప్రదర్శనలు ఇచ్చాడు. స్వదేశంలో 2017లో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో తలపడినప్పుడు ఇషాంత్ భారత పేస్ అటాక్‌కు నాయకత్వం వహించాడు. అయితే బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ ఏకాగ్రతని దెబ్బతీసేందుకు ఇషాంత్ స్లెడ్జింగ్‌కి దిగాడు. తాజాగా ఆ విషయాన్ని లంబూ గుర్తుచేసుకున్నాడు.

విదేశాల్లో ఐపీఎల్ 2020?.. త్వరలో ప్రకటన!!విదేశాల్లో ఐపీఎల్ 2020?.. త్వరలో ప్రకటన!!

స్మిత్‌‌ ఏకాగ్రతని దెబ్బతీసేందుకు

స్మిత్‌‌ ఏకాగ్రతని దెబ్బతీసేందుకు

మయాంక్ అగర్వాల్‌తో జరిగిన లైవ్ చాట్ సందర్భంగా ఇషాంత్ శర్మ పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. పూణేలో జరిగిన తొలి టెస్టులో భారత్ 333 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. దీంతో రెండో టెస్టులో ఎలాగైనా గెలవాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలో బెంగళూరు వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో స్టీవ్‌ స్మిత్‌‌ ఏకాగ్రతని దెబ్బతీసేందుకు ఇషాంత్ శర్మ స్లెడ్జింగ్‌కి దిగాడు. బంతి విసిరిన ఇషాంత్.. స్మిత్ తరహాలో హావభావాల్ని ప్రదర్శించాడు. ఆ తర్వాత బంతిని డిఫెన్స్ చేసిన స్మిత్.. అదేరీతిలో బదులిచ్చాడు.

నాకు స్మిత్ వికెట్ కావాలి

నాకు స్మిత్ వికెట్ కావాలి

స్టీవ్‌ స్మిత్‌పై ఇషాంత్ శర్మ వరుసగా స్లెడ్జింగ్‌కి దిగుతుండటంతో.. లంబూ వద్దకి వెళ్లిన విరాట్ కోహ్లీ ఒక కోరిక కోరాడట. నువ్వు ఏదైనా చెయ్యి.. స్మిత్ వికెట్ మాత్రం నాకు కావాలన్నాడట. అయితే హద్దులు మీరొద్దని మాత్రం చెప్పాడట. 'నువ్వు ఏదైనా చెయ్యి. కానీ నాకు స్మిత్ వికెట్ కావాలి. అయితే నిషేధానికి గురయ్యేలా మాత్రం కవ్వింతలు, స్లెడ్జింగ్‌ మాత్రం చేయొద్దు అని కోహ్లీ సూచించాడు' అని ఇషాంత్ తెలిపాడు. శ్రీలంక గడ్డపై 2015లో హద్దులు దాటిన ఇషాంత్.. ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. రెండో టెస్ట్ గెలిచిన భారత్.. నాలుగోది కూడా గెలిచి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

జహీర్ షూస్‌తో తొలి వన్డే ఆడా..

జహీర్ షూస్‌తో తొలి వన్డే ఆడా..

తన అరంగేట్ర వన్డే మ్యాచ్‌లో జహీర్ ఖాన్ షూస్ వేసుకుని బరిలోకి దిగానని ఇషాంత్ గుర్తు చేసుకున్నాడు. ‘మ్యాచ్ ముందు రోజు అందరూ ప్రాక్టీస్ చేస్తుంటే నేను ఓ పక్కన నిలబడి ఉన్నా. నువ్వు ఎందుకు బౌలింగ్ చేయడం లేదని రాహుల్ ద్రవిడ్ నన్ను ప్రశ్నించాడు. నేను భయంతో నీళ్లు నములుతుంటే ఏంటి అని మళ్లీ అడిగాడు. రాహుల్ బాయ్ నా బ్యాగేజ్ ఇంకా రాలేదని బదులిచ్చా. అయితే ఏంటని ఎదురు ప్రశ్నవేశాడు. నేను నా బ్యాగ్ ప్లైట్ వాడికి ఇచ్చా అది నాకు ఇంకా అందలేదు. అలాగైతే రేపు మ్యాచ్ ఎలా ఆడతావని ద్రవిడ్ ప్రశ్నించాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. చివరకు జహీర్ ఖాన్‌ను అడిగి షూస్ తీసుకొని తొలి వన్డే ఆడా'అని లంబూ చెప్పుకొచ్చాడు.

రికీ అండ‌గా నిలిచాడు

రికీ అండ‌గా నిలిచాడు

'గడేడాది ఐపీఎల్‌లో ఆడేందుకు జట్టులో చేరినప్పుడు కాస్త ఇబ్బందిపడ్డాను. ఢిల్లీ క్యాపిట‌ల్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్ర‌వేశించిన‌ప్పుడు అంతా కొత్త‌గా అనిపించింది. అప్పుడే కెరీర్ ఆరంభించిన కొత్త కుర్రాడిలా బిత్త‌ర చూపులు చూస్తున్న నాకు రికీ పాంటింగ్ అండ‌గా నిలిచాడు. అత‌డితో మాట్లాడిన అనంత‌రం నా ఆత్మ‌విశ్వాసం వెయ్యిరెట్లు పెరిగింది. సీనియర్‌గా ఎలా ఉండాలో నేర్పాడు. అతని సలహాలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి' అని ఇషాంత్‌ తెలిపాడు. లంబూ భారత్ తరఫున 97 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20లు ఆడాడు.

Story first published: Thursday, June 4, 2020, 15:36 [IST]
Other articles published on Jun 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X