న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిటైర్మెంట్ ప్రకటించిన ఐర్లాండ్ జట్టు భీకర క్రికెటర్.. పసికూనకు మరిచిపోలేని విజయాలందించిన యోధుడు

Ireland Star Kevin OBrien Announced Retirement From International Cricket

ఐర్లాండ్ ఆల్‌రౌండర్, స్టార్ హిట్టర్ కెవిన్ ఓబ్రెయన్ తన అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38ఏళ్ల కెవిన్ 2006 జూన్ నెలలో జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. ఇక రిటైర్మెంట్‌కు సంబంధించి ఓబ్రెయన్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా విషయాన్ని వెల్లడించాడు. ఐర్లాండ్‌ జట్టు నుంచి తాను ఈరోజు రిటైర్ అవుతున్నట్లు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశాడు. తద్వారా తన 16ఏళ్ల క్రికెట్ కెరీర్ ముగించాడు.

ఇంగ్లాండ్‌కు మరిచిపోలేని షాకిచ్చిన బ్యాటర్

ఇంగ్లాండ్‌కు మరిచిపోలేని షాకిచ్చిన బ్యాటర్

ఓబ్రెయన్ అరివీర భీకర ఆటగాడు. అతని ఆటతో పసికూన లాంటి ఐర్లాండ్.. మేటి జట్లను కూడా కొన్ని కీలక సందర్భాల్లో ఓడించగలిగింది. వెస్టిండీస్‌లో జరిగిన 2007 ప్రపంచకప్‌లో ఐర్లాండ్ రెండో రౌండ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ టోర్నీలో ఒబ్రెయన్ చెలరేగడంతో ఐర్లాండ్ పాకిస్థాన్‌నే మట్టికరిపించింది. ఇక 2011లో ఇండియాలో వరల్డ్ కప్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ టోర్నీలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఓబ్రెయన్ ఆడాడు. బెంగుళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 63బంతుల్లోనే 113పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ విధించిన 328పరుగుల లక్ష్యాన్ని ఐర్లాండ్ ఛేదించడంలో ఓబ్రెయిన్ పోరాటం అసామన్యంగా సాగింది. తద్వారా ఇంగ్లాండ్‌ను మూడు వికెట్ల తేడాతో ఐర్లాండ్ ఓడించింది. ఇది ఆ జట్టుకు చరిత్రాత్మక విజయం.

లార్డ్స్‌లో టెస్ట్ కూడా ఆడాడు

లార్డ్స్‌లో టెస్ట్ కూడా ఆడాడు

ఇకపోతే వన్డే ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన నలుగురు ఐరిష్ బ్యాటర్లలో కెవిన్ ఓబ్రెయన్ ఒకరు. మిగిలిన ముగ్గురు విలియం పోర్టర్‌ఫీల్డ్, ఎడ్ జాయిస్ మరియు పాల్ స్టిర్లింగ్. 2018లో డబ్లిన్‌లో పాకిస్థాన్‌తో ఐర్లాండ్ తన మొట్టమొదటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌ ఆడింది. ఆ టెస్ట్ మ్యాచ్‌లో ఓబ్రెయన్ కూడా భాగమయ్యాడు. ఇక టీ20ప్రపంచకప్ 2021లో షార్జా క్రికెట్ స్టేడియంలో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో చివరిసారిగా ఓబ్రెయిన్ ఆడాడు. అతను 2019లో లండన్‌లోని ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్ కూడా ఆడాడు.

పాకిస్తాన్‌‌తో మ్యాచ్‌ అయితే పెద్ద స్పెషల్ ఆ? *Cricket | Telugu OneIndia

బ్యాటింగ్, బౌలింగ్లో జట్టుకు కీలక ప్లేయర్‌గా

ఇక తన కెరీర్లో మొత్తం మూడు టెస్టులు, 153 వన్డేలు, 110 టీ20లు ఆడిన ఓబ్రెయన్ నాలుగు సెంచరీలు, 24హాఫ్ సెంచరీల సహాయంతో వరుసగా 258, 3619, 1973పరుగులు చేశాడు. అతని మంచి బ్యాటర్ మాత్రమే కాదు.. మీడియం పేస్ బౌలర్ కూడా. అతను బౌలింగ్లో 172వికెట్లు తీశాడు. అందులో ఓ సిక్స్ వికెట్స్ హాల్ కూడా ఉంది. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో స్టిర్లింగ్, పోర్టర్‌ఫీల్డ్ తర్వాత ఐర్లాండ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా ఓబ్రెయన్ నిలిచాడు. ఐర్లాండ్ జట్టులో ఓ మ్యాచ్ విన్నర్ అయిన ఓబ్రెయన్‌కు ఆ జట్టు సహచరులు, మాజీలు, ఇతర క్రికెట్ ప్రముఖులు వీడ్కోలు అభినందనలు తెలిపారు.

Story first published: Tuesday, August 16, 2022, 16:28 [IST]
Other articles published on Aug 16, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X