న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆఖరి బంతివరకు ఉత్కంఠ: ఉమెన్స్ ఐపీఎల్ మ్యాచ్‌లో విజయం హర్మన్‌‌ప్రీత్‌ సేనదే

By Nageshwara Rao
IPL Womens T20 Live Score, SUP vs TRA: Harmanpreet Kaur Opts To Field vs Trailblazers

హైదరాబాద్: వాంఖడే వేదికగా జరుగుతున్న మహిళల ఐపీఎల్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్ నాయకత్వంలోని సూపర్‌ నోవాస్‌ జట్టు విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్‌‌లో సూపర్‌ నోవాస్‌ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

130 పరుగుల లక్ష్య చేధనకు బరిలోకి దిగిన సూపర్‌నోవాస్ జట్టుకి ఓపెనర్లు మిథాలీ, వైట్‌లు మంచి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కి 47 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే ఏక్తా బిస్త్ వేసిన ఆరో ఓవర్ 4వ బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన మిథాలీ(22) తాహుహుకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.

ఆ తర్వాతి ఓవర్‌లో మరో ఓపెనర్ వైట్(24) పూనమ్ యాదవ్ బౌలింగ్‌లో మూనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టింది. హర్మన్‌ప్రీత్ కౌర్(21) సైతం ఆరో వికెట్‌గా పెవిలియన్‌ చేరడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. విజయానికి నాలుగు పరుగు కావాల్సిన సమయంలో ఏడో వికెట్‌గా మష్రామ్‌(4) రనౌట్‌గా పెవిలియన్‌కు చేరింది.

ఆఖరి ఓవర్‌ను వేసిన బేట్స్‌ కట్టుదిట్టమైన బంతులేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. తొలి రెండు బంతులు ఎదుర్కొన్న పెర్రీ సింగిల్‌ మాత్రమే తీసింది. పుజావస్రాకర్‌ సైతం రెండు బంతులు ఎదుర్కొని సింగిల్‌ తీసింది. ఆ తర్వాత
పెర్రీ మరో పరుగు తీయడంతో స్కోర్లు సమం అయ్యాయి.

చివరి బంతికి సూపర్ నోవాస్ విజయానికి ఒక పరుగు అవసరం కాగా పూజావస్రాకర్‌ ఆ ఒక్క పరుగు తీసి జట్టుకు విజయాన్ని అందించింది. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ట్రయల్‌ బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 129 పరుగులు చేసింది.


ఓపెనర్లను కోల్పోయిన సూపర్ నోవాస్
130 పరుగుల లక్ష్య చేధనకు దిగిన సూపర్‌నోవాస్ జట్టు ఓపెనర్లను కోల్పోయింది. ఓపెనర్లు మిథాలీ, వైట్‌లు మంచి ఆరంభాన్ని అందించారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కి 47 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే ఏక్తా బిస్త్ వేసిన ఆరో ఓవర్ 4వ బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి మిథాలీ(22) తాహుహుకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాతి ఓవర్‌లో మరో ఓపెనర్ వైట్(24) పూనమ్ యాదవ్ బౌలింగ్‌లో మూనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. దీంతో 8 ఓవర్లు ముగిసేసరికి సూపర్‌నోవాస్ 2 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. క్రీజులో మెగ్‌ లానింగ్‌ (15), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(1) పరుగుతో ఉన్నారు.


సూపర్‌నోవాస్ విజయ లక్ష్యం 130
వాంఖడే వేదికగా జరుగుతున్న మహిళల ఐపీఎల్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ట్రయల్‌ బ్లేజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బ్లేజర్స్ జట్టు కెప్టెన్ స్మృతి మంధాన (14) తక్కువ స్కోరుకే ఔటై అభిమానులను నిరాశపరిచింది.

మరో ఓపెనర్ హీలీ (7) పరుగులకే ఔట్ కాగా, ఈ దశలో సుజీ బేట్స్‌ (32), దీప్తి శర్మ (21) నిలకడగా ఆడటంతో బ్లేజర్స్ ఓ మోస్తారు స్కోరు చేసింది. జట్టు స్కోరు 58 వద్ద దీప్తి శర్మ ఔటవగా.. అనంతరం వచ్చిన రోడ్రిగ్స్‌ (25), శిఖా పాండే (14 నాటౌట్) వేగంగా ఆడలేకపోవడంతో ట్రయల్ బ్లేజర్స్ జట్టు 129 పరుగులకే పరిమితమైంది. దీంతో సూపర్‌నోవాస్ జట్టుకు 130 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. సూపర్‌నోవాస్‌ బౌలర్‌ మెగాన్‌ స్కట్‌, ఫెర్రీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.


నిలకడగా ఆడుతోన్న ట్రయల్‌ బ్లేజర్స్‌
వాంఖడే వేదికగా జరుగుతున్న మహిళల ఐపీఎల్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో భాగంగా సూపర్‌నోవాస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ట్రయల్‌ బ్లేజర్స్ బ్యాట్స్ఉమెన్‌ దూకుడుగా ఆడుతున్నారు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు నష్టానికి 94 పరుగులు చేసింది. క్రీజులో సుజీ బేట్స్‌(27), రోడ్రిగ్స్‌ (18) పరుగులతో ఉన్నారు.


10 ఓవర్లకు ట్రయల్‌ బ్లేజర్స్ 65/4
వాంఖడే వేదికగా జరుగుతున్న మహిళల ఐపీఎల్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తోన్న ట్రయల్‌ బ్లేజర్స్ 4 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. ఐదు ఓవర్లలోపే మూడు కీలక వికెట్లు కోల్పోయిన ట్రయల్‌ బ్లేజర్స్ ఇన్నింగ్స్‌ను దీప్తి శర్మ(21), సుజే బేట్స్‌ (11నాటౌట్‌)తో కలిసి నిర్మించే ప్రయత్నం చేసింది.

అయితే, రాజేశ్వరీ గైక్వాడ్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ చివరి బంతికి దీప్తి శర్మ.. హర్మన్‌ ప్రీత్ కౌర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి ట్రయల్‌ బ్లేజర్స్ నాలుగు వికెట్ల నష్టానికి 65పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బేట్స్‌(11) రోడ్రిగ్స్‌ (5) పరుగులతో ఉన్నారు. అంతకముందు ఆ జట్టు ఓపెనర్లు స్మృతి మంధాన (14), హేలీ (7) ఆరంభంలోనే పెవిలియన్ బాట పట్టగా.. బెత్ మూనీ (4)నిరాశపరిచారు.


టాస్ గెలిచి సూపర్‌నోవాస్‌ బౌలింగ్
మహిళల ఐపీఎల్‌ దిశగా తొలి అడుగు పడింది. ముంబైలోని వాంఖడె స్టేడియంలో మహిళల ఐపీఎల్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని సూపర్ నోవాస్ జట్టు టాస్‌ గెలిచి సూపర్‌నోవాస్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది.

సూపర్‌నోవాస్‌ జట్టుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌గా వ్యవహారిస్తోండగా... ట్రయల్‌ బ్లేజర్స్‌ జట్టుకు స్మృతి మందాన నాయకత్వం వహిస్తోంది. మహిళల ఐపీఎల్‌ టోర్నీని ఆరంభించాలనే యోచనలో భాగంగా బీసీసీఐ అందుకు సన్నాహకంగా ఈ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ను నిర్వహిస్తోంది.

ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో విదేశీ మహిళా క్రికెటర్లు సుజీ బేట్స్‌ (న్యూజిలాండ్‌), అలిసా హీలీ, బేత్‌ మూనీ, ఎలిస్‌ పెర్రీ, మెగాన్‌ స్కట్‌ (ఆస్ట్రేలియా), డానియెలె వ్యాట్‌ (ఇంగ్లాండ్‌) ఆడుతున్నారు. ఈ మ్యాచ్ అనంతరం ఇదే వాంఖడే స్టేడియంలో చెన్నై-హైదరాబాద్‌ జట్ల మధ్య క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ జరగనుంది.


జట్ల వివరాలు:
ఐపీఎల్‌ ట్రయల్‌బ్లేజర్స్‌:

స్మృతి మందాన (కెప్టెన్‌), హీలీ (వికెట్‌కీపర్‌), సుజీ బేట్స్‌, దీప్తి శర్మ, బేత్‌ మూనీ, రోడ్రిగ్స్‌, హజెల్‌,పాండే, లీ తహుహు, జులన్‌, ఏక్తా బిష్త్‌, పూనమ్‌ యాదవ్‌, హేమలత.

ఐపీఎల్‌ సూపర్‌నోవాస్:
హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), డానియెలె వ్యాట్‌, మిథాలీ, మెగ్‌ లానింగ్‌, సోఫీ డివైన్‌, ఎలిస్‌ పెర్రీ, వేద కృష్ణమూర్తి, మోనా మేష్రమ్‌, పూజ వస్త్రకర్‌, మెగాన్‌ స్కట్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, అనుజా పాటిల్‌, తాన్యా భాటియా (వికెట్‌కీపర్‌).

Story first published: Tuesday, May 22, 2018, 17:46 [IST]
Other articles published on May 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X