న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అద్భుతమైన రిలే క్యాచ్.. క్రికెట్‌లో ఇలా పట్టగలరా?

IPL Team Rajasthan Royals Post Video Of Stunning Relay Catch || Oneindia Telugu
IPL Team Rajasthan Royals Post Video Of Stunning Relay Catch, and ask Professional Cricketers catch it

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 ముగిసిన రెండు నెలలు అయినా కూడా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టు తమ అభిమానులకు వినోదంను పంచుతోంది. బౌండరీ లైన్ వద్ద ఓ అద్భుత రిలే క్యాచ్‌ను పట్టిన యువకుడి వీడియోను సోమవారం ఆర్ఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ అద్భుత క్యాచ్‌ను క్రికెట్‌లో నిపుణులైన క్రీడాకారులు పట్టగలరా అని రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌ అయింది.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

అద్భుతమైన రిలే క్యాచ్:

కొందరు యువకులు రెండు జట్లుగా విడిపోయి కొబ్బరి తోటలో క్రికెట్‌ ఆడుతున్నారు. అక్కడ బౌండరీ లైన్ కూడా పెట్టుకున్నారు. ప్రత్యర్థి బౌలర్ వేసిన బంతిని ఓ బ్యాట్స్‌మెన్‌ భారీ షాట్‌ ఆడగా.. బంతి బౌండరీ బయటికి వెళుతోంది. బౌండరీ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తున్న ఒక యువకుడు బంతిని చూస్తూ బౌండరీలోకి వెళ్లి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి క్యాచ్‌ పట్టి.. తాను బౌండరీలో పడేలోగా బంతిని మళ్లీ గాల్లో నుంచే మైదానంలోకి విసిరాడు. అక్కడే ఉన్న మరో ఫీల్డర్‌ క్యాచ్‌ అందుకోవడంతో బ్యాట్స్‌మెన్‌ ఔట్ అయ్యాడు. ఆటగాలు సంబరాలు చేసుకున్నారు.

నిపుణులైన క్రీడాకారులు పట్టగలరా:

నిపుణులైన క్రీడాకారులు పట్టగలరా:

యువకుడు బౌండరీ దగ్గర అసాధారణ క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్యాచ్‌ వీడియోను అక్కడే ఉన్న మరో యువకుడు వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశారు. ఇది చూసిన ఆర్ఆర్ యాజమాన్యం తమ ట్విటర్‌ అకౌంట్లో పోస్ట్‌ చేసింది. ఈ క్యాచ్‌ను క్రికెట్‌లో నిపుణులైన క్రీడాకారులు పట్టగలరా అని ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. మీరూ ఓ లుక్కేయండి.

ఆ క్యాచ్ హైలేట్:

ఆ క్యాచ్ హైలేట్:

అయితే ఇలాంటి క్యాచ్‌లు అంతర్జాతీయ క్రికెట్లో కొత్తదేం కాదు. ఇక టీ20 క్రికెట్ టోర్నీలలో అయితే చాలానే చూసాం. 2019 ఐపీఎల్‌లో అయితే చాలానే చూసినా.. దక్షిణాఫ్రికా క్రికెటర్‌ కొలిన్‌ పట్టిన క్యాచ్ హైలేట్ అయింది. ఐపీఎల్ 2019లో పేలవ ప్రదర్శన చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో నిలిచింది. రహానే, స్మిత్ సారధ్య భాద్యతలు రాయల్స్‌ జట్టును కాపాడలేకపోయాయి.

Story first published: Tuesday, July 30, 2019, 10:04 [IST]
Other articles published on Jul 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X