న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ మిడ్ సీజన్ రేటింగ్స్: కెప్టెన్‌గా ధోనీ.. రాయుడు No.1 బ్యాట్స్‌మన్

By Nageshwara Rao
IPL mid-season ratings: Matthew Hayden names MS Dhoni as best captain, picks Ambati Rayudu as No. 1 batsman

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో సగం మ్యాచ్‌లు పూర్తి కావచ్చాయి. దీంతో ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలో ప్రతి జట్టుకు ఖచ్చితమైన అవగాహన వచ్చే ఉంటుంది. దీంతో ఈ సీజన్‌లో రెండో అర్ధభాగంలోని మ్యాచ్‌లు మరింత రసవత్తరంగా సాగుతాయని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్‌ తెలిపాడు.

ఈ సీజన్‌లో మాథ్యూ హేడెన్‌ స్టార్ నెట్‌వర్క్ ఛానెల్ తరుపున కామెంటేటర్‌గా వ్యవహారిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో తనను బాగా ఆకట్టుకున్న బ్యాట్స్‌మెన్‌, కెప్టెన్‌ గురించి మాథ్యూ హేడెన్‌ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియోని ఐపీఎల్ నిర్వాహకులు తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నారు.

జట్ల విజయాల్లో కీలకపాత్ర

టాపార్డర్‌లో వెటరన్‌ బ్యాట్స్‌మెన్‌ షేన్‌ వాట్సన్‌, కేన్‌ విలియమ్సన్, వెస్టిండిస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ అద్భుత ప్రదర్శన చేస్తున్నారని కొనియాడాడు. వారికి ఉన్న అనుభవంతో తమ తమ జట్లను గెలిపించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రసంశల వర్షం కురిపించాడు. ఇక, టాపార్డర్‌లో రాణిస్తోన్న మరో ఆటగాడు ఎవరంటే చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తోన్న అంబటి రాయుడని చెప్పుకొచ్చాడు.

రాయుడి బ్యాట్ నుంచి చక్కటి ఇన్నింగ్స్

రాయుడి బ్యాట్ నుంచి చక్కటి ఇన్నింగ్స్

ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ అంబటి రాయుడు చక్కని ఇన్నింగ్స్ ఆడుతున్నాడని తెలిపాడు. జట్టులోని మిగతా ఆటగాళ్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతుంటే, రాయుడు మాత్రం జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడని పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో ధోనితో కలిసి అంబటి రాయుడు అద్భుతాలు సృష్టిస్తున్నట్లు తెలిపాడు. ఇక, మూడో స్థానం విషయానికి వస్తే తనను ఎంతగానో ఆకట్టుకున్న బ్యాట్స్‌మెన్‌ సురేశ్‌ రైనా అని చెప్పాడు.

అది ఏబీ డివిలియర్స్‌కు మాత్రమే సాధ్యం

అది ఏబీ డివిలియర్స్‌కు మాత్రమే సాధ్యం

ఆ తర్వాత రాబిన్ ఊతప్ప, విరాట్ కోహ్లీలు ఉన్నారని తెలిపాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంజు శాంసన్ కూడా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడని వెల్లడించాడు. ఇక, మిడిలార్డర్‌లో రిషబ్‌ పంత్‌, ఏబీ డివిలియర్స్‌ అని చెప్పాడు. ఎలాంటి బంతినైనా సులభంగా స్టేడియం అన్ని వైపులకు ఆడ కలిగిన సత్తా కేవలం ఏబీకి మాత్రమే ఉందని అన్నాడు. ఫినిషర్ విషయానికి వస్తే అతి కచ్చితంగా ధోనియేనని అన్నాడు.

ఫినిషర్ ధోనినే

ఫినిషర్ ధోనినే

ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ ఫినిషర్ ఎవరంటే అది ధోని మాత్రమే అని హెడెన్ అన్నాడు. ఎవరూ ఊహించని విధంగా జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థుల నుంచి మ్యాచ్‌ను లాక్కొడం ధోని ఒక్కడికి మాత్రమే సాధ్యం అవుతుందని చెప్పాడు. ధోనిని మించిన ఫినిషర్‌ మరొకరు ఉండరని వెల్లడించాడు. ఈ సీజన్‌లో ఆకట్టుకున్న కెప్టెన్‌ ఎవరు అంటే అది కూడా ధోనీయేనని పేర్కొన్నాడు.

Story first published: Monday, April 30, 2018, 15:23 [IST]
Other articles published on Apr 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X