న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోల్‌కతా vs రాజస్థాన్: ఈడెన్‌లో ఇరు జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ గణాంకాలివే!

IPL Match Stats: Kolkata Knight Riders vs Rajasthan Royals at Eden Gardens

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఈ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోంది. ఈ సీజన్‌ను ఎంతో ఘనంగా ఆరంభించిన కోల్‌కతా ఆ తర్వాత వరుస ఓటములతో సతమతమవుతోంది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

మరోవైపు రాజస్థాన్ పరిస్థితి అంతే ఉంది. ఇప్పటివరకు ఆడిన పది మ్యాచ్‌ల్లో కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించి పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం కానుంది. కాగా, ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డు 6-1గా ఉంది. 2008 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది.

ఈడెన్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 7 మ్యాచ్‌లు జరగ్గా అందులో కేకేఆర్ ఆరింట విజయం సాధించింది. ఈ స్టేడియంలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు అత్యధిక విజయాలను నమోదు చేసిన జట్టుగా నిలిచింది. KKR vs RR మ్యాచ్ నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు మీకోసం...

బ్యాటింగ్ ప్రదర్శన

బ్యాటింగ్ ప్రదర్శన

  • 169/7 - ఈ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌పై కేకేఆర్ అత్యధిక స్కోరు. గత సీజన్‌లో కేకేఆర్ ఈ స్కోరు నమోదు చేసింది.
  • 81 ఆలౌట్ - ఈ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ చేసిన అత్యల్ప స్కోరు.
  • 112 పరుగులు - కేకేఆర్ జట్టు తరుపున యూసఫ్ పఠాన్ నెలకొల్పిన అత్యధిక పరుగులే ఒక ఆటగాడు సాధించిన అత్యధిక పరుగులు.
  • 75 నాటౌట్ - 2010 ఐపీఎల్‌ సీజన్‌లో సౌరవ్ గంగూలీ సాధించిన పరుగులు. ఈ స్టేడియంలో ఓ ఆటగాడు సాధించిన ఆత్యధిక పరుగులు.
  • 3 - ఈ స్టేడియంలో ఇరు జట్ల ఆటగాళ్లు నమోదు చేసిన హాఫ్ సెంచరీలు.
  • 52 సిక్సులు - ఈ స్టేడియంలో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు ఇప్పటివరకు బాదిన సిక్సులు
  • బౌలింగ్ ప్రదర్శన

    బౌలింగ్ ప్రదర్శన

    • 5 - ఈ స్టేడియంలో బౌలర్లు తీసిన అత్యధిక వికెట్లు. కేకేఆర్ తరుపున కుల్దీప్ యాదవ్, షకీబ్ అల్ హాసన్‌లు ఈ ఘనత సాధించారు.
    • 4/20 - 2018 ఐపీఎల్ సీజన్‌లో కుల్దీప్ యాదవ్ చేసిన వ్యక్తిగత ప్రదర్శన.
    • వికెట్ కీపింగ్ ప్రదర్శన

      వికెట్ కీపింగ్ ప్రదర్శన

      5 - ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక డిస్మిసల్స్ చేసిన వికెట్ కీపర్‌గా మన్విందర్ బిస్లా నిలిచాడు. ఈ రికార్డుని ఇప్పటివరకు ఎవరూ బద్దలు కొట్టలేదు.

      ఫీల్డింగ్ ప్రదర్శన

      ఫీల్డింగ్ ప్రదర్శన

      3 - రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాడు అజ్యింకే రహానే పట్టిన క్యాచ్‌లు. దీంతో ఈ స్టేడియంలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రహానే నిలిచాడు.

Story first published: Thursday, April 25, 2019, 17:17 [IST]
Other articles published on Apr 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X