న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెన్నైలో CSK vs SRH: ధోనిదే అగ్రస్థానం, ఐపీఎల్ మ్యాచ్ గణంకాలివే!

IPL Match Stats: Chennai Super Kings vs Sunrisers Hyderabad at the MA Chidambaram Stadium

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడునున్నాయి. ఈ మ్యాచ్‌కి చెన్నైలోని చిదంబరం స్టేడియం ఆతిథ్యమిస్తోంది. గతంలో ఈ స్టేడియంలో ఇరు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. ఈ రెండు సార్లు ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్సే విజయం సాధించింది. తాజాగా, ఈ రెండు జట్లు మళ్లీ తలపడుతుండటంతో మ్యాచ్ గణాంకాలను ఒక్కసారి పరిశీలిద్దాం....

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

బ్యాటింగ్ గణాంకాలు

బ్యాటింగ్ గణాంకాలు

209/4 - ఐపీఎల్ 2015లో ఈ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ నమోదు చేసిన అత్యధిక స్కోరు.

159/6 - ఐపీఎల్ 2013లో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నమోదు చేసిన అత్యల్ప స్కోరు.

120 - ఈ గ్రౌండ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధోని నిలిచాడు.

100 నాటౌట్ - ఐపీఎల్ 2015లో సీఎస్‌కే జట్టు తరుపున బ్రెండన్ మెక్‌కల్లమ్ చేసిన సెంచరీయే ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత స్కోరు.

ఇరు జట్ల మధ్య నాలుగు హాఫ్‌సెంచరీలు నమోదు

ఇరు జట్ల మధ్య నాలుగు హాఫ్‌సెంచరీలు నమోదు

4 హాఫ్ సెంచరీలు - ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు నాలుగు హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి.

2 హాఫ్ సెంచరీలు - ఈ మైదానంలో ధోని 2 హాఫ్ సెంచరీలు సాధించాడు.

31 సిక్సులు - ఈ రెండు జట్లకు చెందిన ఆటగాళ్లు ఇప్పటివరకు ఈ మైదానంలో 31 సిక్సులు బాదారు.

9 సిక్సులు - ఇరు జట్ల మధ్య అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా బ్రెండన్ మెక్‌కల్లమ్ నిలిచాడు.

15 ఫోర్లు - సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు శిఖర్ ధావన్ అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సీజన్‌లో శిఖర్ ధావన్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

బౌలింగ్ ప్రదర్శన

బౌలింగ్ ప్రదర్శన

4 వికెట్లు - డ్వేన్ బ్రావో, మోహిత్ శర్మలు అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్లు

3/26 - ఐపీఎల్ 2013లో సన్‌రైజర్స్ ఆటగాడు అమిత్ మిశ్రా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.

ఫీల్డింగ్ ప్రదర్శన

ఫీల్డింగ్ ప్రదర్శన

2 క్యాచ్‌లు - ఈ మైదానంలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన బ్రావో నిలిచాడు.

Story first published: Tuesday, April 23, 2019, 18:01 [IST]
Other articles published on Apr 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X