బటర్ చికెన్‌పై ప్రేమను చంపుకున్నా: కోహ్లీ ఫిట్‌నెస్ మంత్ర ఇదే

Posted By:

హైదరాబాద్: క్రికెట్‌లో ఫిట్‌నెస్ లెవెల్స్ పరంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కొన్ని స్టాండర్డ్స్ సృష్టించాడు. ఫిట్‌నెస్ పరంగా ఎంతో మంది యువ ఆటగాళ్లకు ప్రేరణగా నిలిచాడు. తాను అంత ఫిట్‌గా ఉండటానికి గల కారణాలను సోమవారం కోహ్లీ వెల్లడించాడు.

ఐపీఎల్: నిరాశ పర్చిన కోహ్లీ, ముంబై విజయ లక్ష్యం 163

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్‌‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు సోనీ టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో గత మూడేళ్ల నుంచి తాను బటర్ చికెన్, దాల్ మఖానీని తినడం మానేశానని విరాట్ కోహ్లీ చెప్పాడు.

IPL: Haven't eaten butter chicken for 3 years, reveals RCB captain Virat Kohli

'గత మూడు సంవత్సరాల నుంచి బటర్ చికెన్, దాల్ మఖానీ తినలేదు. నాకు తెలుసు ఏది ముఖ్యమో' అని సోనీ మ్యాక్స్‌తో కోహ్లీ అన్నాడు. ఇక క్రికెట్ నుంచి విశ్రాంతి లభించినప్పుడు ఢిల్లీలోని తన ఇంట్లో కూడా కోహ్లీ 'చీట్ మీల్' మాత్రమే తీసుకుంటానని అన్నాడు.

'చీట్ మీల్'‌లో రైస్‌తో పాటు రజ్మా ఉంటుంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ పదో సీజన్‌లో కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు (ఏప్రిల్ 30)వరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కోహ్లీ సేన ఏడింట పరాజయం పాలై ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.

Story first published: Monday, May 1, 2017, 18:26 [IST]
Other articles published on May 1, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి