న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గ్రౌండ్లో దూరిన ఆకతాయికి జాన్ సేన స్టైల్లో బుద్ధి చెప్పి పోలీసులు.. కోహ్లీ ఫన్నీ రియాక్షన్

 IPL Eliminator: Kohli funny reaction to the police chasing a brat who entered the ground

నిన్న జరిగిన ఐపీఎల్ 2022 ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో అనేక గొప్ప క్షణాలున్నాయి. మ్యాచ్‌ పూర్తి థ్రిల్లింగ్‌గా సాగింది. ఇక ఈ మ్యాచ్ విశేషాల్లోకి వస్తే.. రజత్ పాటిదార్ అద్భుతమైన సెంచరీ, డెత్ ఓవర్లలో దినేష్ కార్తీక్ కీలక ఇన్నింగ్స్, కేఎల్ రాహుల్, దీపక్ హుడాల స్పిరిట్ ఛేజింగ్, డెత్ ఓవర్లలో హర్షల్ పటేల్ అద్భుత బౌలింగ్ ఇలా చాలా విశేషాలు ఈ మ్యాచ్‌లో ఉన్నాయి. ఆఖరి ఓవర్‌లో కూడా మ్యాచ్ ఫలితం ఇంకా ఇరువురి మధ్య దోబూచులాడింది. ఆఖరి ఓవర్‌లో లక్నో విజయానికి 24పరుగులు అవసరమైన దశలో శ్రీలంక ప్లేయర్ దుష్మంత చమీర హర్షల్ వేసిన మూడో బంతికి సిక్స్ కొట్టి ఇంకా లక్నోను ఛేజింగ్లో నిలిపి ఉంచాడు. ఇక తర్వాత బంతుల్లో హర్షల్ రన్స్ రాకుండా బౌలింగ్ వేయడంతో లక్నో 14పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది.

పూర్తిగా నిండిపోయిన స్టేడియం

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో చాలా రోజుల తర్వాత మ్యాచ్‌లు జరగడంతో స్టేడియం పూర్తిగా ప్రేక్షకులతో నిండిపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో విపరీతమైన క్రౌడ్ వచ్చింది. బౌండరీలు, సిక్సర్లు, ఔట్ల టైంలో దద్దరిల్లేలా ప్రేక్షకుల అరుపులు కేకలతో భలే సందడి నెలకొంది. అయితే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓ ఆకతాయి ప్రేక్షకుడు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించాడు. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న టైంలో గ్రౌండ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రూల్స్ ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్రేక్షకులెవరూ కూడా గ్రౌండ్ లోపలికి రాకూడదు. అలా వస్తే జరిమానాతో పాటు ఫైన్ కూడా మ్యాచ్ నిర్వాహకులు విధిస్తారు.

ఆకతాయితో కుస్తీ ఆడిన పోలీసులు,

ఇక ఎలిమినేటర్ మ్యాచ్‌లో గ్రౌండ్లోకి పరిగెత్తుకు వచ్చిన ఆకతాయి నేరుగా విరాట్ కోహ్లీ ఉన్నవైపు వెళ్తుండడంతో అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇద్దరు పోలీసులు వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి ఆ ఆకతాయి కుర్రాణ్ని ఆపారు. అందులో ఓ పోలీసులు డబ్ల్యూడబ్ల్యూఈలో జాన్ సేన ఎలాగైతే రెజ్లర్లను ఎత్తుకుంటాడో.. అలాగే ఆ కుర్రాణ్ని భుజాన ఎత్తుకుని బౌండరీ అవతలకు తీసుకెళ్లాడు. అతన్ని ఎత్తుకుని తీసుకెళ్తున్నప్పుడు విరాట్ కోహ్లీ సైతం ఆ పోలీసుల లాగే ఇమిటేషన్ చేసి రియాక్షన్ ఇచ్చాడు. దీంతో ప్రేక్షకులు ఫుల్ ఎంటర్ టైన్ అయ్యారు. కోహ్లీ రియాక్షన్ ను కొందరు ప్రేక్షకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో నెట్టింట వైరలైంది.

 ఇక తాడో పేడో

ఇక తాడో పేడో

ఐపీఎల్ 2022 టైటిల్‌కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అత్యంత చేరువయ్యింది. లక్నోతో 14పరుగుల తేడాతో గెలుపొందిన బెంగళూరు క్వాలిఫయర్ 1లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. రాజస్థాన్ మీద గెలిస్తేనే ఫైనల్ చేరుతుంది. అయితే ఆర్సీబీ ఎలిమినేటర్లో కనబర్చినదాని కంటే ఎక్కువ జోరు రాజస్థాన్ మీద కనబర్చాల్సిన అవసరముంది. తాడో పేడో తేల్చుకుంటేనే రాజస్థాన్ మీద ఆర్సీబీ పైచేయి సాధించి ఫైనల్‌కు అడుగుపెట్టగలదు. బట్లర్, చాహల్ ఇప్పటికే ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ గెలిచి మంచి జోరు మీదున్నారు

Story first published: Thursday, May 26, 2022, 21:08 [IST]
Other articles published on May 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X