న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ప్రపంచకప్ కన్నా.. ఐపీఎల్ ముఖ్యం: ర‌విశాస్త్రి

IPL, domestic cricket can be prioritised, world events can wait: Ravi Shastri on resumption of sport

ముంబై: కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా తగ్గిన తరువాత క్రీడలు తిరిగి ప్రారంభమయితే.. ముందుగా దేశ‌వాళీ, ద్వైపాక్షిక సిరీస్‌ల‌కే ప్రాధాన్య‌మివ్వాల‌ని టీమిండియా హెడ్ కోచ్ ర‌విశాస్త్రి సూచించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్లోబ‌ల్ ఈవెంట్ల కంటే.. ఐపీఎల్ లాంటి టోర్నీల నిర్వ‌హ‌ణ మంచిదన్నాడు. క్రికెట్ ప‌ట్టాలెక్కే క్ర‌మంలో టీ20 ప్రపంచకప్ కన్నా.. దేశ‌వాళీ క్రికెట్, ఐపీఎల్ ముఖ్యం అని ర‌విశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

ఆర్చర్‌ అదిరే ఐడియా: ప్రేక్షకులు లేకుంటే ఏం.. ఆడియోలు చూస్తూ ఎంజాయ్ చేద్దాం!!ఆర్చర్‌ అదిరే ఐడియా: ప్రేక్షకులు లేకుంటే ఏం.. ఆడియోలు చూస్తూ ఎంజాయ్ చేద్దాం!!

 దేశీయ క్రికెట్ సాధారణ స్థితికి రావాలి:

దేశీయ క్రికెట్ సాధారణ స్థితికి రావాలి:

తాజాగా హెడ్ కోచ్ ర‌విశాస్త్రి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ... 'నేను ప్రస్తుతం ప్రపంచ టోర్నీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వను. ముందుగా దేశీయ క్రికెట్ సాధారణ స్థితికి వచ్చేలా చూసుకోవాలి. అందుకోసం అంతర్జాతీయ, ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు అందరూ తిరిగి మైదానంలోకి రావాలి. మెల్లిగా ద్వైపాక్షిక క్రికెట్‌తో ఆటలు ప్రారంభించాలి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో గ్లోబ‌ల్ ఈవెంట్ల కంటే.. దేశీయ క్రికెట్, ఐపీఎల్ త‌దిత‌ర టోర్నీల నిర్వ‌హ‌ణ చాలా త‌క్కువ రిస్క్‌తో కూడి ఉంటుంది' అని అన్నాడు.

ప్రపంచకప్ కన్నా.. ఐపీఎల్ ఈజీ:

ప్రపంచకప్ కన్నా.. ఐపీఎల్ ఈజీ:

'ద్వైపాక్షిక పర్యటన ద్వారా కేవలం ఒక జట్టే ఇతర దేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. టీ20 ప్రపంచకప్ అయితే చాలా దేశాల నుంచి టీమ్‌లు రావాల్సి ఉంటుంది. ప్ర‌యాణం, త‌దిత‌ర విషయాల్లో రిస్క్ ఉంటుంది. ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐపీఎల్ లాంటి టోర్నీల‌ను ఒక‌ట్రెండు వేదికల్లో నిర్వ‌హించుకోవ‌చ్చు. కానీ.. టీ20 ప్రపంచకప్ అలా నిర్బహించడం సాధ్యం కాదు. ఐసీసీ ఈ విషయాలు అన్ని పరిశీలించాలి' అని ర‌విశాస్త్రి సూచించాడు. క్రికెట్ కార్య‌కలాపాలు తిరిగి ప్రారంభ‌మైన‌ట్ల‌యితే టీ20 ప్రపంచకప్ కన్నా.. ఐపీఎల్ ‌లాంటి టోర్నీలకే ప్రాధాన్య‌నిస్తా అని పేర్కొన్నాడు.

గాడిలో పడడానికి సమయం పడుతుంది:

గాడిలో పడడానికి సమయం పడుతుంది:

మ‌రోవైపు గ‌త రెండు నెల‌లు ఒక స్పోర్ట్స్‌మ‌న జీవితంలో చాలా క‌ఠిన‌మైన‌వ‌ని శాస్త్రి చెప్పాడు. గ‌త ఏడేనిమిది ద‌శాబ్ద‌ల క్రికెట్ హిస్ట‌రీలో ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎప్పుడు ఎదురుకాలేద‌న్నాడు. ఎంత స్టార్ ఆటగాడు అయినా తిరిగి గాడిలో పడడానికి సమయం పడుతుందన్నాడు. కేవలం క్రికెట్ మాత్రమే కాదు.. ఏ క్రీడ అయినా సవాలుగా ఉంటుందని శాస్త్రి చెప్పుకొచ్చాడు. ఆటగాడు నిరంతరం ప్రాక్టీస్ చేయాల్సిందే అన్నాడు.

 ఆటగాళ్లకు శిక్షణ శిబిరాలు:

ఆటగాళ్లకు శిక్షణ శిబిరాలు:

కరోనా సంక్షోభం ముగిసి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుందని బోర్డు కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ వెల్లడించాడు. ఒకవేళ ఈనెల 18 నుంచి లాక్‌డౌన్‌లో సడలింపులు ఉంటే.. ప్లేయర్లు ఇంటి సమీపంలోని మైదానాల్లో శిక్షణ (నెట్‌ ప్రాక్టీస్‌) ప్రారంభించవచ్చని, ఈ విషయంపై బీసీసీఐ ఆప్షన్లను పరిశీలిస్తున్నదని గురువారం అన్నాడు.

Story first published: Friday, May 15, 2020, 13:16 [IST]
Other articles published on May 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X