న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: అత్యధికంగా 11 మందిని తీసుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌.. పూర్తి జట్టిదే!!

IPL 2020 : Rajasthan Royals Team Full Squad ! || Oneindia Telugu
IPL Auction 2020: Final List of Rajasthan Royals Squad after players auction, big buys, money spent

హైదరాబాద్: గురువారం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 వేలం కోల్‌కతాలో పూర్తయింది. ఇందులో మొత్తం 62 మంది ఆటగాళ్లను ప్రాంఛైజీలు కొనుగోలు చేశారు. ఈ వేలంలో మొత్తం రూ.140 కోట్లు ఖర్చు చేశారు. వేలం తర్వాత కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అత్యధిక ఆటగాళ్ల (25)తో కొనసాగుతున్నాయి. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అత్యల్పంగా 21 మందిని కలిగి ఉంది.

వేలంలో 'యూసుఫ్'కు చుక్కెదురు.. ఇర్ఫాన్‌ భావోద్వేగ ట్వీట్‌!!వేలంలో 'యూసుఫ్'కు చుక్కెదురు.. ఇర్ఫాన్‌ భావోద్వేగ ట్వీట్‌!!

అత్యధికంగా 11 మంది:

ఐపీఎల్ 2020 వేలం ముగిసేసరికి రాజస్థాన్‌ రాయల్స్‌ మొత్తం 25 ఆటగాళ్లతో కూడిన జట్టును తయారుచేసుకుంది. 25 మందిలో 8 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అంజిక్య రహానే ట్రేడింగ్ పద్దతిలో ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌ జట్టుకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సారధిగా వ్యవహరించనున్నారు. గత సీజన్-12లో కూడా స్మిత్ కొన్ని మ్యాచులకు కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే.

ఉతప్పకే టాప్ ధర:

రాజస్థాన్‌ ప్రాంఛైజీ ఓషానే, ఇష్ సోహి, లియామ్ లివింగ్స్టోన్, జైదేవ్‌ ఉనాద్కట్‌, స్టువర్ట్ బిన్నీలను వేలానికి ముందు విడుదల చేసింది. అయితే ఈ వేలంలో రాజస్థాన్ ప్రాంఛైజీ ఆటగాళ్ల విషయంలో ఆచితూచి వ్యవహరించింది. ఒక్క ఆటగాడికి కూడా 3 కోట్లకు పైగా వెచ్చించలేదు. రాబిన్‌ ఉతప్ప, జైదేవ్‌ ఉనాద్కట్‌లకు మాత్రమే రూ. 3.0 కోట్లు ఖర్చు చేసింది. యశస్వి జైస్వాల్‌ రూ. 2.4 కోట్లు, కార్తీక్‌ త్యాగిని రూ. 1.3 కోట్లకు తీసుకోగా.. టామ్‌ కరన్‌, ఆండ్రూ టైలను 1.0 కోటికి దక్కించుకుంది.

75 లక్షలకే మిల్లర్‌:

అనుజ్‌ రావత్‌ (రూ. 80 లక్షలు), డేవిడ్‌ మిల్లర్‌ (రూ. 75 లక్షలు), ఒషానే థామస్‌ (రూ. 50 లక్షలు), అనిరుధ అశోక్‌ జోషి (రూ. 20 లక్షలు), ఆకాశ్‌ సింగ్‌ (రూ. 20 లక్షలు)లను రాజస్థాన్‌ తక్కువకే సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా హార్డ్ హిట్టర్ డేవిడ్‌ మిల్లర్‌ను కూడా రూ. 75 లక్షలకు దక్కించుకోవడం విశేషం. ఈ వేలంలో రాజస్థాన్ రాయల్స్ మొత్తం రూ .29.90 కోట్లు ఖర్చు చేసింది.

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు:

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు:

స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, సంజు సామ్సన్, జోస్ బట్లర్, రియాన్ పరాగ్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, మహిపాల్ లోమోర్, వరుణ్ ఆరోన్, మనన్ వోహ్రా వంటి ప్రధాన ఆటగాళ్లను రాజస్థాన్ రాయల్స్ అట్టిపెట్టుకుంది. రాహుల్ తెవాటియా, అంకిత్ రాజ్‌పూత్, మయాంక్ మార్కండే ట్రేడ్ ద్వారా జట్టులోకి వచ్చారు.

రాజస్థాన్ రాయల్స్ పూర్తి జట్టు:

స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, సంజు సామ్సన్, జోస్ బట్లర్, రియాన్ పరాగ్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, మహిపాల్ లోమోర్, వరుణ్ ఆరోన్, మనన్ వోహ్రా, రాహుల్ తెవాటియా, అంకిత్ రాజ్‌పూత్, మయాంక్ మార్కండే, రాబిన్‌ ఉతప్ప, జైదేవ్‌ ఉనాద్కట్‌, యశస్వి జైస్వాల్‌, కార్తీక్‌ త్యాగి, టామ్‌ కరన్‌, ఆండ్రూ టై, అనుజ్‌ రావత్‌, డేవిడ్‌ మిల్లర్‌, ఒషానే థామస్‌, అనిరుధ అశోక్‌ జోషి, ఆకాశ్‌ సింగ్‌.

Story first published: Friday, December 20, 2019, 15:56 [IST]
Other articles published on Dec 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X