న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వేలంలో 'యూసుఫ్'కు చుక్కెదురు.. ఇర్ఫాన్‌ భావోద్వేగ ట్వీట్‌!!

IPL Auction 2020: After auction snub, Irfan Pathan reaches out to Yusuf Pathan

కోల్‌కతా: ఐపీఎల్‌ 2020 వేలంలో టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్‌ యూసుఫ్ పఠాన్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. యూసుఫ్ పఠాన్‌ను కొనుగోలు చేసేందుకు ఎవరూ బిడ్ దాఖలు చేయలేదు. ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్న అతడిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు విముఖత ప్రదర్శించాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు యూసుఫ్ పఠాన్‌ను వదులుకోగా.. రూ. కోటి కనీస ధరతో వేలంలో ఉన్న విషయం తెలిసిందే.

'కుంబ్లే నిరాశకు గురై కాట్రెల్‌ను తీసుకున్నాడు.. 8.5 కోట్లు అవసరం లేదు''కుంబ్లే నిరాశకు గురై కాట్రెల్‌ను తీసుకున్నాడు.. 8.5 కోట్లు అవసరం లేదు'

యూసుఫ్ పఠాన్‌కు వేలంలో చుక్కెదురు కావడంతో అతని సోదరుడు, టీమిండియా క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. 'తాత్కాలిక ఇబ్బందులు ఏవీ నీ కెరీర్‌ను ప్రభావితం చేయలేవు. నీ అత్యుత్తమ ఆటతీరును ఎప్పటికీ మరిచిపోలేము. నువ్వే నిజమైన మ్యాచ్‌ విన్నర్‌వి. నిరంతరం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా లాలా' అంటూ భావోద్వేగ ట్వీట్‌ చేశాడు.

యూసుఫ్ పఠాన్ 2019 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్‌ తరపున ఆడి పేలవ ప్రదర్శన కనబరిచిచాడు. యూసుఫ్ సీజన్-12లో 10 మ్యాచ్‌లు ఆడి 13.33 సగటుతో కేవలం 40 పరుగులనే చేసాడు. ఇక ఐపీఎల్‌ మొత్తం సీజన్లో కేవలం ఇక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. క్రికెట్ కెరీర్ ఆరంభంలో అద్భుతంగా ఆయన యూసుఫ్.. టీమిండియాకు కొన్ని అద్భుత విజయాలు అందించాడు కూడా. ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టులో చోటు కోల్పోయాడు. ఇప్పుడు ఏకంగా లీగులలో కూడా సత్తాచాటలేకపోతున్నాడు.

చతేశ్వర పుజారా, హనుమ విహారి, ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీకి కూడా నిరాశే ఎదురైంది. వీరిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. గప్టిల్‌, గ్రాండ్‌హోమ్‌, లూయిస్‌, హోల్డర్‌, షై హోప్‌, బ్రాత్‌వైట్‌, ముస్తఫిజుర్‌, ఆండ్రూ టై, కటింగ్‌, జాంపా, ప్లంకెట్‌లను ఎవరు కొనుగోలు చేయలేదు. అయితే ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు అత్యధిక ధరకు అమ్ముడుపోయారు. కమ్మిన్స్‌ను రూ. 15.5 కోట్లకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కొనుగోలు చేసింది. మానసిక ఒత్తిడి కారణంగా మూడు నెలల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్న 31 ఏండ్ల మ్యాక్స్‌వెల్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ (రూ.10.75 కోట్లు) చేజిక్కించుకుంది.

Story first published: Friday, December 20, 2019, 14:31 [IST]
Other articles published on Dec 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X