న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేడు ఐపీఎల్‌ 2020 వేలం.. హాట్‌కేకుల్లా ఆసీస్‌, విండీస్‌ ఆటగాళ్లు!!

IPL 2020 Auction: Maxwell, Hetmyer, Noor Ahmad & Players Who Can Prove Expensive ? | Oneindia Telugu
IPL Auction 2020: A look at what the 8 franchises need, 332 players trying their luck under the hammer

కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వేలం గురువారం కోల్‌కతాలో జరగనుంది. ఇప్పటి వరకు బెంగళూరులో జరిగిన వేలం.. మొదటిసారిగా కోల్‌కతాలో జరుగుతుంది. మొత్తం 332 మంది ఆటగాళ్లు వేలానికి రానుండగా.. 8 జట్లలో మొత్తం 72 స్థానాలే ఖాళీగా ఉన్నాయి. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ ఉన్న నేపథ్యంలో ఈ ఐపీఎల్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు యువ ఆటగాళ్లు జాక్‌పాట్‌ కొట్టే అవకాశాలున్నాయి.

<strong>దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కలిస్‌.. ఇకనైనా ప్రొటీస్ రాత మారేనా!!</strong>దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కలిస్‌.. ఇకనైనా ప్రొటీస్ రాత మారేనా!!

హాట్‌కేక్‌గా నూర్‌ అహ్మద్‌:

హాట్‌కేక్‌గా నూర్‌ అహ్మద్‌:

లీగ్‌లో వేలానికి రానున్న వారిలో పిన్న వయస్కుడైన అప్ఘానిస్థాన్‌ స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ (14) హాట్‌కేక్‌గా అమ్ముడయ్యే అవకాశం ఉంది. నూర్‌ కనీస ధర రూ. 30 లక్షలు. ఇతగాడు లెఫ్టామ్‌ చైనామన్‌ స్పిన్నర్‌. తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి భారత వెటరన్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే (48) కూడా ఆశగా ఎదురుచూస్తున్నాడు. క్రికెట్‌పై ఉన్న ఇష్టంతో ఇతగాడు ఇంకా ఆడుతున్నాడు. కుర్రాళ్లను కాదని 48 ఏళ్ల తాంబేను ఫ్రాంఛైజీలు కొనుక్కుంటారో లేదో చూడాలి.

 పోరెల్‌కు భారీ డిమాండ్‌:

పోరెల్‌కు భారీ డిమాండ్‌:

దేశవాళీల్లో అదరగొట్టిన అండర్-19 కెప్టెన్ ప్రియం గార్గ్, యశస్వి జైస్వాల్‌, ఆర్‌. సాయి కిషోర్‌ లాంటి యువ ఆటగాళ్లపైనా ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నారు. బెంగాల్‌ పేసర్‌ ఇషాన్‌ పోరెల్‌ కోసం డిమాండ్‌ ఏర్పడింది. వీరి కనీస ధర రూ. 20 లక్షలు. రాబిన్‌ ఊతప్ప, యూసఫ్‌ పఠాన్‌, పియూష్‌ చావ్లా, ఉనాద్కట్‌ లాంటి భారత సీనియర్లు కూడా వేలానికి అందుబాటులో ఉన్నారు.

మ్యాక్స్‌వెల్, హెట్‌మైర్‌లపై కన్ను:

మ్యాక్స్‌వెల్, హెట్‌మైర్‌లపై కన్ను:

ఆస్ట్రేలియా ఆటగాళ్లపై కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్, క్రిస్ లిన్, మిచెల్‌ మాల్స్, పాట్ కమిన్స్, జొస్ హాజల్‌వుడ్‌లకు అత్యధిక ధర లభించే అవకాశముంది. బెంగళూరు విడుదల చేసిన విండీస్‌ బిగ్‌ హిట్టర్‌ షిమ్రన్‌ హెట్‌మైర్‌తో పాటు మీడియం పేసర్‌ కెస్రిక్‌ విలియమ్స్‌పై కూడా ఫ్రాంచైజీలు కన్నేశాయి.

స్టెయిన్‌కు ధర పలికేనా?:

స్టెయిన్‌కు ధర పలికేనా?:

శ్రీలంక సీనియర్‌ ప్లేయర్‌ ఏంజెలో మాథ్యూస్‌, సఫారీ పేసర్‌ స్టెయిన్‌ ప్రారంభ ధర రూ.2 కోట్లతో ఉండగా.. వీరిపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతాయా అనేది చూడాలి. టెస్టు ఆటగాళ్లు హనుమ విహారి, ఛతేశ్వర పుజారా రూ. 50 లక్షల ప్రాథమిక ధరతో ఉన్నారు. గత సీజన్‌లో ఢిల్లీకి ఆడిన విహారిని విడుదల చేయగా.. పుజారాను ఎవరూ కొనలేదు. ఈసారి డబ్బు తక్కువగా ఉండడంతో ఫ్రాంచైజీలు అచితూచి ఖర్చుపెట్టే అవకాశం ఉంది.

Story first published: Thursday, December 19, 2019, 8:33 [IST]
Other articles published on Dec 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X