న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరుదైన ఘనత: ఐపీఎల్‌కు ఎంపికైన మూడో కాశ్మీరీ క్రికెటర్‌గా రసిక్ దార్

IPL Auction 2019: Rasikh Dar becomes third Kashmir cricketer to be picked at auction, to play for MI

హైదరాబాద్: ఐపీఎల్‌ 12వ సీజన్‌ కోసం వేలం ముగిసింది. ప్రాంఛైజీలు యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించాయి. మొత్తం 1003 మంది ప్లేయర్లు ఈ వేలానికి రిజిస్ట్రేషన్ చేసుకోగా, ప్రాంఛైజీల సూచన మేరకు 351 మంది తుది జాబితాకు ఎంపిక చేశారు. ఇందులో 228 మంది భారత ఆటగాళ్లున్నారు.

<strong>ఒక్క టీ20 ఆడలేదు, వేలంలో రూ 4.8 కోట్లు పలికాడు: ఎవరీ ప్రభ్ సిమ్రాన్ సింగ్‌</strong>ఒక్క టీ20 ఆడలేదు, వేలంలో రూ 4.8 కోట్లు పలికాడు: ఎవరీ ప్రభ్ సిమ్రాన్ సింగ్‌

70 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకునేందుకు 8 ఫ్రాంచైజీలు పోటీపడగా 60 మందిని కొనుగోలు చేశాయి. ఇందులో 40 మంది భారత్ నుంచి కాగా 20 విదేశీ ఆటగాళ్లున్నారు. వీళ్ల కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ. 106.8 కోట్లు ఖర్చు చేశాయి. ఈ వేలంలో కాశ్మీర్‌కు చెందిన రసిక్ సలామ్ దార్‌ను ముంబై ఇండియన్స్ రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది.

మూడో కాశ్మీరీ క్రికెటర్‌గా రసిక్ దార్‌

మూడో కాశ్మీరీ క్రికెటర్‌గా రసిక్ దార్‌

ఈ నేఫథ్యంలో ఇండియన్ ప్రీమియిర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడబోతోన్న మూడో కాశ్మీరీ క్రికెటర్‌గా రసిక్ దార్‌ నిలిచాడు. అంతకముందు పర్వేజ్ రసూల్, మంజూర్ దార్‌లు ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఉన్న పర్వేజ్ రసూల్‌ జమ్మూ కాశ్మీర్ నుంచి ఐపీఎల్‌కు ఆడిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచాడు.

సన్ రైజర్స్‌కు ఆడిన పర్వేజ్ రసూల్

సన్ రైజర్స్‌కు ఆడిన పర్వేజ్ రసూల్

పర్వేజ్ రసూల్‌ని తొలుత పూణె వారియర్స్ జట్టు కొనుగోలు చేసింది. ఆ తర్వాత అతడిని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో వేలానికి ముందు విడుదల చేసింది. మంగళవారం జరిగిన వేలంలో పర్వేజ్ రసూల్‌ను ఏ ప్రాంఛైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చలేదు.

ఒక్క మ్యాచ్ కూడా ఆడని మంజూర్ దార్‌‌

ఒక్క మ్యాచ్ కూడా ఆడని మంజూర్ దార్‌‌

రెండో ఆటగాడైన మంజూర్ దార్‌‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రాంఛైజీ కొనుగోలు చేసింది. అయితే, ఇప్పటివరకు మంజూర్ దార్ ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం విశేషం. ఇక, రసిక్ దార్ విషయానికి వస్తే ఈ ఏడాది విజయ్ హాజారే ట్రోఫీతో లిస్ట్-ఏ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. జైపూర్ వేదికగా మంగళవారం జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ కోనుగోలు చేయడంతో జట్టులో చేరేందుకు చాలా ఆతృతగా ఉన్నట్లు రసిక్ దార్ వెల్లడించాడు.

ముంబై ఇండియన్స్:

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా, కృనాల్ పాండ్య, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, మయాంక్ మార్కండే, రాహుల్ చాహర్, అనుకుల్ రాయ్, సిద్ధార్థ్ లాడ్, ఆదిత్య టారే, క్వింటన్ డికాక్, ఎవిన్ లూయిస్, కీరన్ పోలార్డ్, బెన్ కటింగ్, మిచ్ మెక్‌క్లెనాగన్, ఆడమ్ మిల్నే, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్,

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: లసిత్ మలింగ (రూ.2 కోట్లు), అన్మోల్‌ప్రీత్ సింగ్‌ (రూ.80 లక్షలు), బరీందర్ శ్రాన్‌ (రూ.3.40 కోట్లు), పంకజ్ జైస్వాల్‌ (రూ.20 లక్షలు), రసిక్ దార్‌ (రూ.20 లక్షలు), యువరాజ్ సింగ్ (రూ.1 కోటి).

Story first published: Wednesday, December 19, 2018, 15:30 [IST]
Other articles published on Dec 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X