న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కావ్యా పాప ఫేవరెట్ బ్యాటర్‌కు అదృష్టం అలా తన్నుకొచ్చింది: కేప్టెన్‌గా అపాయింట్

IPL 2022, SRH: West Indies appointed Nicholas Pooran as the new captain of the ODI and T20Is

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భలేగా కలిసి వస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి తరువాత అద్భుతంగా పుంజుకొంది. వరుసగా అయిదు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఒక దశలో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి వెళ్లి కూర్చుంది. ఆ తరువాత వరుసగా రెండు పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ.. లక్ష్యాన్ని ఛేదించడానికి ఆరెంజ్ ఆర్మీ పోరాడిన తీరు ప్రశంసలు అందుకుంది. రెండింట్లో ఓటమి తరువాత కూడా నెట్ రన్‌రేట్ పెద్దగా చెదిరిపోకపోవడమే దీనికి నిదర్శనం.

రేపే తదుపరి మ్యాచ్..

రేపే తదుపరి మ్యాచ్..

గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓటమి తరువాత.. సన్‌రైజర్స్ తన తరువాతి మ్యాచ్‌ ఢిల్లీ కేపిటల్స్‌తో ఆడనుంది. గురువారం సాయంత్రం 7:30 గంటలకు ముంబై సీసీఐ-బ్రబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ ఆరంభమౌతుంది. ఇందులో గెలిచి మళ్లీ తన తడాఖాను రుచి చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. దీనికోసం నెట్స్‌లో శ్రమిస్తోన్నారు ప్లేయర్లు. చివరి రెండు మ్యాచ్‌లల్లో ఓడిపోవడానికి కారణమైన లోపాలను గుర్తించి, సరిదిద్దుకుంటున్నారు.

విండీస్ కేప్టెన్‌గా..

విండీస్ కేప్టెన్‌గా..

కాగా- సన్‌రైజర్స్ మిడిలార్డర్ బ్యాటర్ ప్లస్ వికెట్ కీపర్ నికొలస్ పూరన్‌కు అద్భుత అవకాశం లభించింది. అతను వెస్టిండీస్ వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 జట్ల కేప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈ రెండు ఫార్మట్లకు అతణ్ని కేప్టెన్‌గా నియమించింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. ఐపీఎల్ టోర్నమెంట్ ముగిసిన వెంటనే అతను జట్టు పగ్గాలను అందుకుంటాడు. షయ్ హోప్ వైస్‌ కేప్టెన్‌గా అపాయింట్ అయ్యాడు. నెదర్లాండ్స్, పాకిస్తాన్‌తో మూడు చొప్పున వన్డే ఇంటర్నేషనల్స్‌ను ఆడాల్సి ఉంది వెస్టిండీస్‌కు.

కీరన్ పొల్లార్డ్ స్థానంలో..

కీరన్ పొల్లార్డ్ స్థానంలో..

ఐసీసీ ప్రపంచకప్ సూపర్ లీగ్‌లో భాగంగా వెస్టిండీస్-నెదర్లాండ్స్ మధ్య మూడు వన్డే సిరీస్‌ జరుగనుంది. నికొలస్ పూరన్ సారథ్యంలో వెస్టిండీస్ ఈ రెండు సిరీస్‌లను ఆడుతుంది. ఇదివరకు ఈ రెండు ఫార్మట్లకు కేప్టెన్‌గా వ్యవహరించిన కీరన్ పొల్లార్డ్.. తప్పుకొన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌కు అతను గుడ్‌బై చెప్పాడు. దీనితో అతని స్థానంలో పూరన్‌ను అపాయింట్‌ చేసింది విండీస్ బోర్డు. షయ్ హోప్‌కు వైస్ కేప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది.

రెండు ఫార్మట్లల్లో నిలకడగా..

నిజానికి- పూరన్‌కు వెస్టిండీస్ జట్టుకు కేప్టెన్‌గా వ్యవహరించడం కొత్తేమీ కాదు. కీరన్ పొల్లార్డ్ జట్టుకు అందుబాటులో లేని సమయంలో అతనే సారధ్యా బాధ్యతలను తీసుకున్నాడు. జట్టును నడిపించాడు. వెస్టిండీస్ తరఫున 37 వన్డే, 57 టీ20 ఇంటర్నేషనల్స్‌ను ఆడాడు పూరన్. ఈ రెండింట్లోనూ 1100లకు పైగా పరుగులు చేశాడు. వన్డేల్లో 1121, టీ20ల్లో 1193 పరుగులు చేశాడు. ఈ రెండు ఫార్మట్లలోనూ అతను నిలకడగా రాణిస్తున్నాడనడానికి ఈ పరుగులు చాలు.

సన్‌రైజర్స్ క్యాంప్‌లో జోష్..

సన్‌రైజర్స్ క్యాంప్‌లో జోష్..

తనను కేప్టెన్‌గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు పూరన్. ప్రస్తుతం అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో కలిసి ముంబైలో ఉంటోన్నాడు. కేప్టెన్‌గా అపాయింట్ అయ్యాడనే విషయం తెలిసిన వెంటనే సన్‌రైజర్స్ క్యాంప్‌లో జోష్ నిండింది. తోటి ప్లేయర్లందరూ అతణ్ని అభినందనలతో ముంచెత్తారు. ఫ్రాంఛైజీ ఓనర్ కావ్యా మారన్‌ అతనికి బెస్ట్ విషెస్‌ పంపించింది. అత్యంత కీలమైన బాధ్యతలను బోర్డు తనకు అప్పగించిందని, నమ్మకాన్ని నిలబెడతానని చెప్పాడు పూరన్. తనకు దక్కిన అతి గొప్ప గౌరవంగా భావిస్తానని వ్యాఖ్యానించాడు.

Story first published: Wednesday, May 4, 2022, 8:45 [IST]
Other articles published on May 4, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X