న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ముద్ర: చెక్కు చెదరని.. చెరిపేయలేని రికార్డ్

IPL 2022, SRH vs PBKS: Sunrisers Hyderabad is the only team to win IPL title after playing in Eliminator

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌ లీగ్ దశ ముగియబోతోంది. ఈ సాయంత్రం జరిగే మ్యాచ్ చిట్టచివరిది. ఇక ప్లేఆఫ్స్ ఆరంభమౌతాయి. ఎలిమినేటర్స్, క్వాలిఫయర్స్ కోసం పోరాటం మొదలవుతుంది. ఎల్లుండి తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఉంటుంది. సాయంత్రం 7:30 గంటలకు కోల్‌కత ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక. టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్.. రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. తొలి ఎలిమినేటర్ బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. లక్నో సూపర్ జెయింట్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ కొంటాయి.

 భారీ స్కోర్‌కు ఛాన్స్..

భారీ స్కోర్‌కు ఛాన్స్..

లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇవ్వాళ పంజాబ్ కింగ్స్‌ను ఢీ కొట్టనుంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు ముంబై వాంఖెడె స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ప్లేఆఫ్స్‌ రేసు నుంచి ఈ రెండు జట్లు కూడా తప్పుకొన్నాయి. గెలుపుతో ఈ సీజన్‌ను ముగించాలనే తాపత్రయం రెండు జట్లల్లో కనిపిస్తోంది. తన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్.. ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఢిల్లీ కేపిటల్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓడింది. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. ప్లేఆఫ్స్ చేరాలనే ఒత్తిడి లేకపోవడం వల్ల స్వచ్ఛగా ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.

నిర్లక్ష్యానికి ఫలితం..

నిర్లక్ష్యానికి ఫలితం..

ఫస్ట్ హాఫ్‌లో వరుసగా అయిదు మ్యాచ్‌లల్లో ఘన విజయాలను అందుకున్న తరువాత ఒక్కసారిగా కుప్పకూలింది సన్‌రైజర్స్. అయిదు మ్యాచ్‌లల్లో ఎలా విజయం సాధించిందో.. ఆ తరువాతి అయిదింట్లో అదే రేంజ్‌లో ఓడిపోయింది. ఫస్ట్ హాఫ్‌లో ఉన్నప్పటి దూకుడు కొనసాగించలేకపోయింది. ఫస్ట్ హాఫ్‌లో రెండో స్థానం వరకు ఎగబాకిన ఈ జట్టు.. ప్రస్తుతం 12 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి దిగజారింది. మొత్తంగా 13 మ్యాచ్‌లల్లో ఏడింట ఓడింది. నామ్ కే వాస్తేగా జరిగే ఈ మ్యాచ్ రిజల్ట్స్ ఎలా ఉంటుందనేది రాత్రికి తేలిపోతుంది.

కేప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్..

కేప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్..

సన్‌రైజర్స్ కేప్టెన్ కేన్ విలియమ్సన్.. జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. అతను ఇప్పటికే స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండట్లేదు. అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు తాత్కాలికంగా జట్టు కేప్టెన్సీ పగ్గాలను అప్పగించింది. మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్‌ది కూడా ఇదే పరిస్థితి. ఈ జట్టు కూడా ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు ఆరింట్లో నెగ్గింది. 12 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. చివరి మ్యాచ్‌లో ప్రత్యర్థిని జయించడం ద్వారా పరువును నిలబెట్టుకోవడం తప్ప దాని వల్ల ఒరిగేదేమీ ఉండదు. రెండు జట్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది.

చెక్కు చెదరని రికార్డ్..

చెక్కు చెదరని రికార్డ్..

కాగా.. ఐపీఎల్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ చెక్కు చెదరని ముద్రను వేసింది. ఐపీఎల్ 2016 సీజన్‌లో నమోదు చేసిన ఈ రికార్డ్ ఇప్పటికీ చెక్కు చేదరట్లేదు. అదే- ఎలిమినేటర్ మ్యాచ్‌ను ఆడి టైటిల్‌ను ఎగరేసుకెళ్లడం. ఎలిమినేటర్ మ్యాచ్‌ను ఆడటం అంటే.. చిట్టచివరి దశలో ప్లేఆఫ్స్‌లో అవకాశం దక్కించుకున్నట్టు. ఆ స్థాయి నుంచి టైటిల్ ఛాంపియన్‌గా ఎదగడం అనేది ఒక్క సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మాత్రమే సాధ్యమైంది. 2016లో ఆలస్యంగా నాలుగో స్లాట్‌ను బుక్ చేసుకున్న ఆరెంజ్ ఆర్మీ.. ఎలిమినేటర్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌తో తలపడింది. ఆ జట్టును చిత్తు చేసింది. దర్జాగా ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. ఫైనల్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును మట్టికరిపించింది.

Story first published: Sunday, May 22, 2022, 15:55 [IST]
Other articles published on May 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X